Begin typing your search above and press return to search.
పవన్ వెంట శంకరం..డేట్లు కోసమే ఆ పాట్లు!
By: Tupaki Desk | 17 Jun 2022 4:30 PM GMTఏపీలో రాజకీయ కాక నడుమ పవన్ కళ్యాణ్ సినిమా ఆలోచనలు..నిర్ణయాలు యూ టర్న్ దిశగా కదులుతున్నాయా? ఉన్న పళంగా సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బిజీ అయ్యే ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి సంసిద్దమవుతున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం.
ఎన్నికల సమీపం..ముందొస్దు ఎన్నికలు అన్న కోణంలో వైకాపా..టీడీపీ ఓటర్ వద్దకు వెళ్లే కార్యక్రమం మొదలుపెట్టాయి. జనసేన అధినపేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. సినిమాకి సంబంధించి ముఖ్యమైన పనులుంటే చూసుకోవడం మినహా ఎక్కువ సమయం పార్టీ శ్రేణులకే కేటాయిస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ ప్రజల వద్దకు వెళ్లేందుకు బస్సు యాత్రని తలపెట్టారు. ఆ యాత్ర రేపో..మాపో ప్రారంభం అవుతుందన్న తీరున ప్రచారం సాగుతోంది. ఏ క్షణమైన పవన్ బస్సు యాత్ర ప్రారంభం అవ్వొచ్చని పార్టీ వర్గాలు సైతం బలంగానే లీకులిస్తున్నాయి. అదే జరిగితే ఉన్న పళంగా పవన్ కమిట్ అయిన ప్రాజెక్ట్ లు ఎక్కడికక్కడ నిలిచిపోవడం ఖాయం.
ఇప్పటివవరకూ పవన్ అధికారికంగా కమిట్ అయిన ప్రాజెక్ట్ లు రెండు. ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న `హరి హర వీరమల్లు`.. రెండు హరీష్ తో చేయనున్న `భవదీయుడు భగత్ సింగ్`. హరి హర ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది కాబట్టి ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాగూ సినిమా మధ్యలో వదిలేసి వెళ్లరు కాబట్టి పవన్ ఆ ప్రాజెక్ట్ ని పూర్తిచేసేస్తారు.
కానీ భవదీయుడే డైలమాలో పడే అవకాశం కనిపిస్తుంది. పోస్టర్ వేసి ప్రకటనైతే ఇచ్చారు గానీ..ఈ సినిమాకి పవన్ ఇంత వరకూ డేట్లు కేటాయించలేదని సమాచారం. ఈనేపథ్యంలోనే పవన్ వెంట హరీష్ శంకర్ తిరుగుతున్నాడా? పవన్ డేట్లు లాక్ చేయడం కోసమే ఆయన్ని వెంబడిస్తున్నారా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
కానీ నిర్మాణ సంస్థతో పవన్ కి ర్యాపో తక్కువ. హరీష్ కథ విని పవన్ ఊ కొట్టారు. పవన్ -మైత్రిని కలపింది కూడా శంకరమే. ఆ తర్వాతే పవన్ నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ అందుకున్నారు. అలా మైత్రీ అడ్వాన్స్ పవన్ వద్ద లాక్ అయింది. తాజా పరిస్థితులు మైత్రీకి అనుకూలంగా కనిపించలేదు. పవన్ పొలిటికల్ షెడ్యూల్..సినిమాకి డేట్లు కేటాయించకపోవడం..హరీష్ శంకర్ ఆయన వెంట తిరుగుతోన్న సన్నివేశం చూస్తుంటే ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కుతుందా? అన్ సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
మరోవైపు హరీష్ శంకర్ పై మైత్రీ మూవీ మేకర్స్ ఒత్తిడి కూడా మొదలైందని గుస గుస వినిపిస్తుంది. పవన్ ఇచ్చిన అడ్వాన్స్ కారణంగా వడ్డీ లాస్ అవుతున్నామనే వ్యధని సైతం మైత్రీ వ్యక్తం చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇక పవన్ తో ఈ సినిమా తీయడం కోసం హరీష్ శంకర్ రెండేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు.
కథ సిద్దం చేయడానికి కొన్ని నెలలు సమయం పడితే.. ఆ కథని పవన్ కి వినిపించి మెప్పించడానికి రెండేళ్లు సమయం పట్టింది. తీరా చూస్తే ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో కూడా క్లారిటీ లేని పరిస్థితి ఎదురవుతుంది. మరి భవదీయుడు విషయంలో చివరిగా ఏం జరుగుతుందో ఆ పెరుమాళ్లకే తెలియాలి.