Begin typing your search above and press return to search.
అబ్బో.. ఆ పాట వెనుక చాలా కథ
By: Tupaki Desk | 26 Aug 2015 10:29 AM GMTమెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ జాబితా తీస్తే చాంతాడంత అవుతుంది. అందులో నుంచి మోస్ట్ పాపులర్ సాంగ్స్ లిస్టు తీయడం కూడా చాలా కష్టమే. సినిమాలంటే ఆసక్తి లేని వాళ్లు సైతం ఏదో ఒక టైంలో చిరు పాటల్ని హమ్ చేసే ఉంటారు. అలాంటి పాటల్లో ‘ఖైదీ నెంబర్ 786’లోని గువ్వా గోరింకతో.. ఒకటి. ఈ పాటనే డైరెక్టర్ హరీష్ శంకర్-సాయిధరమ్ తేజ్ ల సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో రీమిక్స్ చేశారు. రాజ్-కోటి ట్యూన్ ను పెద్దగా మార్చకుండానే కొత్త పాటను రెడీ చేసేశాడు మిక్కీ జే మేయర్. ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ పాటతో పాటు దీని ఏవీ కూడా ప్రదర్శించారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చే స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాట సినిమాలో హైలైట్ అవుతుందని.. ఈ పాట రీమక్స్ చేయడం, దాని చిత్రీకరణ వెనుక చాలా కష్టం దాగుందని హరీష్ శంకర్ చెప్పాడు.
‘‘సాయిధరమ్ లో మేనమామ పోలికలు చాలా కనిపిస్తాయి. 80లు, 90ల్లో చిరంజీవి ఉన్నట్లే ఉంటాడు. అందుకే అప్పటి చిరంజీవి పాటను ఏదైనా రీమిక్స్ చేయాలనుకున్నాం. కానీ పాట ఎంచుకోవడానికి చాలా చాలా కష్టమైంది. ఒకటా రెండా చాలా చాలా ఆప్షన్స్ కనిపించాయి. వాటిలోంచి ఒకటి ఎంచుకోవడం చాలా కష్టమైంది. చివరికి దిల్ రాజు గారు, నేను కలిసి గువ్వా గోరింకతో.. పాటను ఎంచుకున్నాం. ఈ పాటను ఫారిన్ లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ఐతే మేం పాట తీసిన ప్రదేశంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఆ సమయానికి అక్కడ చేరుకోవాలంటే ఉదయం రెండున్నర మూడుకల్లా సాయి, రెజీనా లేవాల్సి వచ్చేది. అంతకుముందు రోజు రాత్రి 12 వరకు వాళ్లు రిహార్సల్స్ చేసేవాళ్లు. ఆ పాట షూటింగ్ జరిగినన్నాళ్లు.. వాళ్లిద్దరూ రెండు మూడు గంటలే నిద్రపోయారు. వాళ్లు పడ్డ కష్టానికి హ్యాట్సాఫ్. కచ్చితంగా ఈ పాట మెగా అభిమానులు సహా అందరినీ అలరిస్తుంది’’ అని హరీష్ చెప్పాడు.