Begin typing your search above and press return to search.
సినిమాలో ఆ డైలాగ్ ఉండదట!
By: Tupaki Desk | 19 Sep 2019 2:30 PM GMTప్రస్తుతం టాలీవుడ్లో సినిమా టీజర్, ట్రైలర్స్ లో ఒక బూతు వాడటం దాంతో హైప్ క్రియేట్ చేసి బిజినెస్ చేసుకోవడం సహజమైపోయింది. అర్జున్ రెడ్డితో మొదలైన ఈ బూతు పూరణం ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. లేటెస్ట్ గా వాల్మీకి లో కూడా ఓ బూతు వాడాడు హరీష్ శంకర్. దాన్ని ట్రైలర్ లో వదిలాడు కూడా.
అయితే ఆ బూతుపై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అసలు బూతులు లేకుండా ట్రైలర్ కట్ చేయలేరా అంటూ హరీష్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పడ్డాయి. ఇక ఆ పోస్టులు హరీష్ కి రీచ్ అయ్యాయి. అందుకే సినిమాలో ఆ డైలాగ్ ను తీసేసారట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు హరీష్.
అయితే ఆ బూతు ఒక మనిషిని ఉద్దేశించింది కాదని అది జస్ట్ జీవితాన్ని ఉద్దేశించి పెట్టిందని కానీ కొందరు ఆ భూతు వల్ల వేరే సినిమాలతో కలిపి మాట్లాడుతున్నారని అందుకే తీసేసామని చెప్పుకున్నాడు. అంతే కాదు ఆ ఒక్క బూతు వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా దూరం అవ్వడం అస్సలు ఇష్టం లేదని తెలిపాడు. సో ట్రైలర్ లో జిందగీ అనే పదం తర్వాత వచ్చే ఆ బూతు డైలాగ్ సినిమాలో ఉండదన్నమాట.