Begin typing your search above and press return to search.

మళ్ళీ పంచ్ లు పేల్చిన హరీశ్‌ శంకర్

By:  Tupaki Desk   |   27 Jun 2017 4:17 AM GMT
మళ్ళీ పంచ్ లు పేల్చిన హరీశ్‌ శంకర్
X
డీజే- దువ్వాడ జగన్నాధం.. అంటూ ఒకే పాత్రలో రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించాడు. ఈ మూవీకి మొదటి రోజు నుంచి మిక్సెడ్ టాక్ తో పాటు నెగిటివ్ టాక్ కూడా నడిచింది. అలాగే రివ్యూలు కూడా బాగా నెగిటివ్ గానే వచ్చాయి. సినిమాలోని ప్రతీ అంశాన్ని నెగిటివ్ గా రాసిన దాఖలాలు కూడా ఉన్నాయి.

అయితే.. డీజే మాత్రం వాటన్నిటినీ తోసిరాజంటూ వసూళ్ల వర్షం కురిపించేస్తోంది. దీంతో మూవీ యూనిట్ అంతా కలిసి.. సక్సెస్ మీట్ నిర్వహించారు. అయితే ఇది సక్సెస్ మీట్ కాదు.. థ్యాంక్యూ మీట్ అంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. 'బన్నీ కెరీర్ లోనే కాదు.. ఇండస్ట్రీ టాప్5 బ్లాక్ బస్టర్స్ జాబితాలోకి డీజే చేరిపోతుంది. ఈ స్థాయికి చేరుకునేందుకు యూనిట్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఇంతటి సినిమా తీయడంలో.. నిర్మాత దిల్ రాజుతో పాటు.. హీరో అల్ల అర్జున్ ఎంతో శ్రమించారు. నాకు పురుష సూక్తం నేర్చుకునేందుకు ఏడాది పట్టింది. కానీ బన్నీ మాత్రం రెండు నెలల్లోనే నేర్చుకున్నాడంటే.. సినిమాపై తపన అర్ధమవుతుంది. ఈ సినిమాలో మాస్ ఎంటర్టెయిన్మెంట్ కోసం రాసిన డైలాగ్స్ మాత్రమే కాదు.. మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఎవరికి కావాల్సిన వాటిని వాటిని తీసుకుంటారు' అన్నాడు హరీష్ శంకర్.

'ఒక పాత్రను ఒకరు చేసినంత మాత్రాన ఇంకొకరు చేయకూడదని లేదు. అంకుశం నుంచి.. గబ్బర్ సింగ్.. పటాస్.. రాధా ఇలా అనేక సినిమాల్లో పోలీస్ పాత్ర చూశాం. ఫ్యాక్షన్ పాత్రలు చాలానే చూశాం అలాగే బ్రాహ్మిన్ హీరో రోల్ తో సినిమాలు తక్కువ వచ్చాయి. సో కంపేరిజన్ సహజం. అయినా సరే.. మేం ఊహించినదాని కంటే పెద్ద విజయం కట్టబెట్టారు. సినిమా సక్సెస్ అంటే రెవెన్యూలు కనబడాలి.. రివ్యూలు కాదు. రివ్యూ రైటర్లు కూడా మా పని తీరుని విమర్శించండి.. మమ్మల్ని కాదు. గబ్బర్ సింగ్ తర్వాత నాకు యూటిట్యూడ్ వచ్చిందంటారు. నాకు యాటిట్యూడ్ ఉండబట్టే గబ్బర్ సింగ్ వచ్చింది. అంతే కానీ.. గబ్బర్ సింగ్ తో యాటిట్యూట్ రాలేదు' అంటూ తన స్టైల్ లో పంచ్ లు చాలానే ఇచ్చాడు హరీష్ శంకర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/