Begin typing your search above and press return to search.

వెబ్ సైట్స్ వల్ల సంస్కారం నేర్చుకున్నా: హరీష్

By:  Tupaki Desk   |   18 Sep 2019 6:08 AM GMT
వెబ్ సైట్స్ వల్ల సంస్కారం నేర్చుకున్నా: హరీష్
X
టాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన అతి తక్కువమంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'వాల్మీకి' సెప్టెంబర్ 20 న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో హరీష్ బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సంచలనాత్మక రీతిలో సమాధానాలు ఇచ్చాడు.

*రీసెంట్ గా మీరు 'వాల్మీకి' ఈవెంట్లో 'వినయ విధేయతలు నేర్చుకుంటున్నాను' అని అన్నారు. ఆ స్టేట్ మెంట్ కు అర్థం ఏంటి?

లైఫ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మీలాంటి వారి వల్లనే... యూట్యూబ్ ఛానెల్స్ వల్ల.. వెబ్ సైట్స్ వల్ల సంస్కారం అనేది నేర్చుకుంటున్నా(అదోరకమైన చిలిపి నవ్వు).

*దీన్ని మేము పాజిటివ్ గా తీసుకోవాలని అంటారా?

నేను పాజిటివ్ గానే చెప్పాను. మీవల్ల నేను ఒక మార్పూకు లోనయ్యాను అని చెప్తున్నాను.

*ఇండస్ట్రీలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి.. మీకు ఉన్నాయా?

సెంటిమెంట్స్ అసలు పట్టించుకోను. అలా పట్టించుకుంటే.. 'గబ్బర్ సింగ్' లోశ్రుతి హాసన్ ను హీరోయిన్ గా ఎంచుకున్నప్పుడు గోల జరిగింది. అయినా మేము అవేవీ పట్టించుకోలేదు. 'డీజె' లో పూజా హెగ్డే ను పెట్టినపుడు కూడా అలాంటి వ్యాఖ్యలే వినిపించాయి. అయినా వారినే తీసుకున్నాం కదా.

*ఐరన్ లెగ్ అని ముద్ర పడినవారిని.. ఫ్లాపుల్లో ఉన్నవారిని మీరు ఏరికోరి తీసుకుంటారని టాక్ ఉంది. మీరేమంటారు?

అలాంటివి నేను పట్టించుకోను.. నేను రాసిన కథకు.. కథలోని పాత్రకు వారు సరిపోతారా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాను. 'రామయ్య వస్తావయ్యా' లో సమంతా హీరోయిన్. అప్పట్లో సమంతా గోల్డెన్ లెగ్గే కదా మరి ఆ సినిమా ఫ్లాప్ అయిందిగా. నా ఫస్ట్ ఫిలిం 'షాక్' పెద్ద ఫ్లాపు. అయినా రవి తేజ గారు 'వీడు ఐరన్ లెగ్' అని అలోచించలేదు కదా? అవేవీ పట్టించుకుండా నాకు ఆయన 'మిరపకాయ్' అవకాశం ఇచ్చారు. నాకు ఒక హీరో అలా అవకాశం ఇచ్చినప్పుడు నేను ఫ్లాప్ లో ఉన్న హీరోయిన్ కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? సినిమా ఫ్లాప్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. దానికి ఒక్క హీరోయిన్ ను నిందించడం అనేది అమానుషం అని నా అభిప్రాయం.