Begin typing your search above and press return to search.
మెగా ఆఫర్ ని హరీష్ శంకర్ రిజెక్ట్ చేశాడా..?
By: Tupaki Desk | 19 Nov 2020 3:50 PM GMTమెగాస్టార్ చిరంజీవి మళయాళ హిట్ సినిమా 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటి నుంచి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ఫిలిం సర్కిల్స్ పెద్ద డిస్కషన్ జరిగింది. ముందుగా ఈ రీమేక్ ని యువ దర్శకుడు, 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తాడని అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకున్నాడు. దీంతో ఈ స్క్రిప్ట్ బాధ్యతలు డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలో పెట్టారని.. ఇప్పటికే రచయిత ఆకుల శివతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వినాయక్ ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేయడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు తెర పైకి వచ్చింది. ఇప్పటికే పలు రీమేక్ లను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఈ సినిమాకు న్యాయం చేయగలడని, తెలుగు నేటివిటికీ తన ఇమేజ్ కు అనుగుణంగా మార్చగలడని చిరంజీవి భావించారట. దీని కోసం ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఇప్పటికే హరీష్ తో చర్చలు కూడా జరిపారట. అయితే హరీష్ శంకర్ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. ఎందుకంటే హరీష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే పవన్ 'వకీల్ సాబ్' సినిమా తర్వాత 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ కి డేట్స్ ఇచ్చాడట. దీంతో పవన్ - హరీష్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ నడిచింది. అయితే తాజాగా సినీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇటీవలే పవన్ ని కలిసిన హరీష్.. తమ ప్రాజెక్ట్ విషయమై చర్చించాడట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో క్రిష్ సినిమాతో పాటు ప్యారలల్ గా ఈ సినిమాని కూడా కంప్లీట్ చేద్దామని పవన్ మాటిచ్చాడట. అందుకే హరీష్ శంకర్ మెగా రీమేక్ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడట. కాకపోతే చిరంజీవితో త్వరలోనే మంచి స్క్రిప్ట్ తో స్ట్రెయిట్ సినిమా చేస్తానని హరీష్ నమ్మకంగా ఉన్నాడట.