Begin typing your search above and press return to search.

హరీష్.. వినయం విధేయత గౌరవం

By:  Tupaki Desk   |   16 Sep 2019 7:46 AM GMT
హరీష్.. వినయం విధేయత గౌరవం
X
డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ ఇచ్చే సమయంలో కాస్త ఓపెన్ గా మాట్లాడే వ్యక్తి,. అప్పుడపుడు సెటైర్లు వేసేందుకు కూడా వెనుకాడడు. ఒక్కోసారి మీడియా మీద కూడా పంచులేసే టైపు! నిన్న జరిగిన 'వాల్మీకి' ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజుకు.. హరీష్ కు మధ్య ఇంట్రెస్టింగ్ టాక్ జరిగింది.

హరీష్ స్పీచ్ ఇచ్చే సమయంలో దిల్ రాజు గారు వచ్చి కూర్చున్నారు. దీంతో కెమెరా ఫోకస్ ఆయనపైకి పోవడంతో "రాజు గారు సినిమాను కాకపోయినా స్పీచ్ ను డిస్టర్బ్ చేస్తున్నారు. లవ్ యూ అన్నా.. థాంక్స్ ఫర్ కమింగ్" అంటూ తన స్పీచ్ ను కంటిన్యూ చేశాడు. మరి 'సినిమాను కాకపోయినా' అని ఎందుకు అన్నాడో ఏంటో!

తన స్పీచ్ లోనే మరో సందర్భంలో ప్యాషన్ ఉన్న నిర్మాతల గురించి మాట్లాడుతూ "డైరెక్టర్ ప్యాషన్.. హీరో ప్యాషన్ మాత్రమే ఒక సినిమాకు సరిపోదు. ప్యాషన్ ఉండే నిర్మాత కూడా ఉండాలి. డబ్బుఖర్చు పెట్టే ప్రొడ్యూసర్లు చాలామంది ఉంటారు కానీ ప్యాషన్ తో ఉండే ప్రొడ్యూసర్లు చాలా తక్కువమంది ఉంటారు. మా రాజన్న(దిల్ రాజు) లాంటి వాళ్ళు.. అలాగే ఈ సినిమా నిర్మతలు గోపి గారు రామ్ గారు అలాంటి వారే. చాలామంది ప్రొడ్యూసర్ల ను ఖర్చు పెట్టించడానికి కన్విన్స్ చేయాలి. కానీ మా ప్రొడ్యూసర్లను ఖర్చు ఆపేందుకు కన్విన్స్ చేయాలి" అన్నాడు.

అంతే కాదు నిర్మాతలు తనపై కూడా ఒక కంట్రోలర్ ను పెట్టారని ఒక ఇంట్రెస్టింగ్ అంశం వెల్లడించాడు "ప్రతి ఈ సినిమాకు ప్రొడక్షన్ కంట్రోలర్ ఉంటారు. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ కంట్రోలర్ అని మా నిర్మాతలు ఒకరిని పెట్టారు. ఆయనే హరీష్ కట్టా. అయన పని డైరెక్టర్ ను కంట్రోల్ చేయడం! మా డైరెక్టర్ కంట్రోలర్ హరీష్ కట్టా గారికి థ్యాంక్స్" అన్నాడు. దీంతో చాలామంది నవ్వుల్లో మునిగిపోయారు.

ఇక హరీష్ స్పీచ్ ముగించే సమయంలో "ఈమధ్యే వినయం విధేయత గౌరవం నేర్చుకుంటున్న మీ హరీష్ శంకర్" అంటూ ఎండ్ చేశాడు. ఇదిలా ఉంటే దిల్ రాజుగారు చాలా తక్కువ సమయమే మాట్లాడారు కానీ మైక్ తీసుకోగానే "అందరికీ నమస్కారం. మా హరీషు వినయ విధేయంగా తయారైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ తన స్పీచ్ ప్రారంభించడం అందరినీ ఆకర్షించింది.