Begin typing your search above and press return to search.

ఒక డీఎస్పీ.. 2 పాటలు.. 20 గంటలు

By:  Tupaki Desk   |   7 Feb 2017 5:28 AM GMT
ఒక డీఎస్పీ.. 2 పాటలు.. 20 గంటలు
X
గత ఏడాది తెలుగులో నేను శైలజ.. నాన్నకు ప్రేమతో.. సర్దార్ గబ్బర్ సింగ్.. జనతా గ్యారేజ్ లాంటి మ్యూజికల్ హిట్లిచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాల ఫలితాలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ.. సంగీత దర్శకుడిగా దేవి మాత్రం నిరాశ పరచలేదు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నెంబర్ 150’ వర్క్ కూడా గత ఏడాదే పూర్తి చేశాడు. ఇలా ఒకే ఏడాది ఐదు క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తూ కూడా క్వాలిటీ చూపించడం దేవికే చెల్లింది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండానే యమ స్పీడుగా పని చేయడం దేవి స్పెషాలిటీ. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలోనూ దేవి అదే స్పీడు.. అదే క్వాలిటీ చూపిస్తున్నాడని అంటున్నాడు హరీష్ శంకర్.

‘డీజే’ కోసం దేవి 20 గంటల పాటు నిర్విరామంగా పని చేశాడట. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చిన దేవి.. ఈ 20 గంటల్లోనే రెండు అదిరిపోయే పాటలు ఇచ్చేసి చెన్నై వెళ్లిపోయాడట. ఆ రెండు సూపర్ హిట్ పాటల్ని ఎప్పుడెప్పుడూ షూట్ చేద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు హరీష్ శంకర్ తెలిపాడు. దేవిశ్రీని సర్ జీ అని సంబోధిస్తూ అతడికి థ్యాంక్స్ చెప్పాడు. దేవి-హరీష్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద మ్యూజికల్ హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే అల్లు అర్జున్‌ తో దేవి చేసిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ గా మంచి విజయం సాధించాయి. ఈ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న ‘డీజే’ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ ఆడియో ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్లో ‘డీజే’ ఆడియో విడుదలయ్యే అవకాశముంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెలలోనే ‘డీజే’ టీజర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/