Begin typing your search above and press return to search.

హరీశ్ శంకర్ దాగుడు మూతలు

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:05 PM GMT
హరీశ్ శంకర్ దాగుడు మూతలు
X
హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ అనాలా లేక కాంట్రోవర్శీ కింగ్ అనాలో కాని.. హరీష్ శంకర్ పేరు వింటే అన్నీ గుర్తొస్తుంటాయ్. దువ్వాడ జగన్నాధం సినిమా మొదలు పెట్టినప్పిటి నుండి విడుదలై బాక్స్ ఆఫీసు కలెక్షన్లు చర్చలు దాకా అన్నీ విమర్శతోనే జరిగింది. ఆ సినిమా పాటలు పైన కానీ సినిమా కలెక్షన్ల ప్రచారంలో కానీ హరీష్ శంకర్ తీవ్ర విమర్శలు ఎదుకున్నాడు. అయితే దువ్వాడ జగన్నాధం సినిమా నుండి హరీష్ పూర్తిగా బయటపడినట్లు కనిపిస్తుంది. ఈ మధ్య తన కొత్త సినిమా కోసం విదేశాలుకు కూడా వెళ్ళొచ్చాడు.

తన కొత్త సినిమా టైటిల్ ను ‘దాగుడు మూతలు’ అని పెట్టేశాడట హరీశ్. ఈ సినిమా లొకేషన్లు కోసం USA వెళ్ళి ఆ పనులు పూర్తి చేసుకొని ఈ మధ్యనే తిరిగి వచ్చినట్లు టాక్. ఈ దాగుడు మూతల కథ దిల్ రాజు కు బాగ నచ్చిందిట. నిమా కథాంశం కూడా ఫ్యామిలి ప్రేక్షకులును యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఉండబోతున్నాయి అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు యంగ్ హీరోలను పడేయాలని చూస్తున్నారు హరీశ్. నాని - శర్వానంద్ ఈ సినిమాలో హీరోలు గా చేసే అవకాశం ఉంది. అయితే నాని ఇప్పుడు ‘MCA’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ ఏడాదికి సరిపడా షూటింగ్ షెడ్యూల్ ఉన్నాయి నానికి. అలాగే శర్వానంద్ కూడా ‘మహానుభావుడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తయ్యే వరకు హరీశ్ తో వీరు దాగుడు మూతలు ఆడక తప్పదు.

దువ్వాడ జగన్నాధం లాంటి కమర్షియల్ కథతో వచ్చి రకరకాల విమర్శలు ఎదుర్కున్న హరీష్ శంకర్ ఈ కథతో అందరిని మెప్పిస్తాడు అని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఈ సినిమాలో నటిస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో షూటింగ్ కూడా మొదలుకావచ్చు.