Begin typing your search above and press return to search.
ఔను.. ఎన్టీఆర్ కు ‘ఎమ్మెల్యే’ కథ చెప్పాడట
By: Tupaki Desk | 28 Jan 2018 9:21 AM GMTఎమ్మెల్యే.. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరకెక్కతున్న కొత్త సినిమా. ఐతే ఈ టైటిల్ చాలా ఏళ్ల కిందటే ప్రచారంలోకి వచ్చింది. ఈ పేరుతో హరీష్ శంకర్ ఓ సినిమా చేయాలనుకున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ కు కథ కూడా చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత హరీష్-ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘రామయ్యా వస్తావయ్య’ సినిమా వచ్చింది. అందరూ ‘ఎమ్మెల్యే’ను మరిచిపోయారు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా ఇదే పేరుతో సినిమా రాబోతోంది. ఐతే ఇప్పుడు ‘టచ్ చేసి చూడు’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ తాను ఒకప్పుడు ఎన్టీఆర్ తో ‘ఎమ్మెల్యే’ అనే సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే అని హరీష్ శంకర్ ఇప్పుడు వెల్లడించడం విశేషం.
‘‘దర్శకుడిగా నా తొలి సినిమా ‘షాక్’ ఫ్లాప్ అయ్యాక నేను నైరాశ్యంలో ఉన్నపుడు.. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) గారి ఆఫీసులోనే రెండేళ్ల పాటు నా జర్నీ సాగింది. ఆ సమయంలోనే నేను ఎన్టీఆర్ కు ‘ఎమ్మెల్యే’.. అంటే ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ కథ చెప్పాను. ఐతే అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత నాకు ‘మిరపకాయ్’ అవకాశం వచ్చింది. బుజ్జి గారితో రెండేళ్ల నా ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. అప్పుడే విక్రమ్ సిరికొండ పరిచయమయ్యాడు. నేను ఒక రచయితగా.. దర్శకుడిగా నా పేరు తెరమీద చూసుకోవాలని నేనెంత తపించానో.. విక్రమ్ పేరును దర్శకుడిగా చూడాలని అంతే బలంగా కోరుకుంటున్నాను. అతను మా బ్యాచ్ అందరిలోకి సుపీరియర్ డైరెక్టర్ అవుతాడని నా నమ్మకం. ఇక రవితేజ గురించి నేను ఇంతకుముందే చాలా సార్లు చెప్పాను. నిన్న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ‘సినీ పరిశ్రమలో నా ఉనికికీ.. నా ఉన్నతికీ కారణమైన మాస్ రాజాకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశాను. నా ఒక్కడికే కాదు.. శ్రీను వైట్ల.. మలినేని గోపీచంద్.. బాబీ.. రసూల్ ఎల్లోర్.. బోయపాటి శ్రీను.. పరశురామ్.. విక్రమ్ సిరికొండ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి అవకాశాలిచ్చి లైఫ్ ఇచ్చాడు. పరిశ్రమలో దర్శకుల్ని రవితేజ నమ్మినట్లుగా.. ఆయన సపోర్ట్ చేసినట్లుగా ఇంకెవ్వరూ చేయరు’’ అని హరీష్ అన్నాడు.