Begin typing your search above and press return to search.

కథ చెప్పాడా ? క్యాజువల్ గా కలిశాడా

By:  Tupaki Desk   |   5 Oct 2017 5:09 PM GMT
కథ చెప్పాడా ? క్యాజువల్ గా కలిశాడా
X
చివరగా దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు హరీష్ శంకర్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా దర్శనం ఇచ్చాడు. ఎవరు ఊహించని విధంగా హరీష్ శంకర్ బాలీవుడ్ డాన్ ను కలిశాడు. షారుక్ ఖాన్ తో కలిసి హరీష్ శంకర్ ఎంతో ప్రేమతో ఒక ఫొటో దిగాడు. అందుకు సంబందించిన ఫొటో ను కూడా హరీష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా హరీష్ శంకర్ ను షారుక్ ఖాన్ కౌగిలించుకోవడం చూస్తుంటే ఇద్దరు ఎప్పటి నుంచో తెలిసినట్లు క్లోజ్ గా స్టీల్ ఇచ్చారుగా అని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హరీష్ శంకర్ కొత్త కథ ఏమైనా చెప్పాడా? లేక క్యాజువల్ గా కలిశాడా? అని డౌట్ పడుతున్నారు జనాలు. ప్రస్తుతం షారుక్ ఖాన్ - ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ అక్కడే ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది.

ఇక హరీష్ శంకర్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ సినిమా తీసిన తర్వాత ఇంతవరకు ఏ సినిమా చేస్తున్నాడు అనే దానిమీద వివరణ ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితం కొంత మంది హీరోలతో మల్టి స్టారర్ చేస్తున్నాడని టాక్ వచ్చింది. కానీ ఇంకా అది ఫైనల్ అవ్వలేదు. తరువాత పవన్ కళ్యాణ్‌ సినిమా అని కూడా టాక్ వచ్చింది. అది కూడా క్లారిటీ లేదు. మరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో మొదలు పెడతాడో చూడాలి.