Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు..ఇంగ చెప్పేదేం లేదు సేసేదే..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 5:21 AM GMT
సుధీర్ బాబు..ఇంగ చెప్పేదేం లేదు సేసేదే..!
X
విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు హీరో సుధీర్ బాబు. నిట్రోస్టార్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న సుధీర్ బాబు 'శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌'తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చారు. ఈ మూవీ త‌రువాత త‌ను న‌టించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో త‌న‌ని మ‌రో లెవెల్లో ప్రజెంట్ చేసే స‌రికొత్త సినిమాకు శ్రీ‌కారం చేట్టాడు. పీరియాడిక్ స్టోరీగా ఈ మూవీ సాగ‌నుంది.

1989 నేప‌థ్యంలో సాగే క‌థ‌గా ఈ మూవీని తెర‌పైకి తీసుకురానున్నారు. సుధీర్ బాబు న‌టిస్తున్న 18వ మూవీగా రూపొంద‌నున్న ఈ సినిమాని శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై సుమంత్ జి. నాయుడు నిర్మించ‌నున్నారు.

ఈ మూవీకి 'సెహ‌రి' ఫేమ్ జ్ఞాన‌సాగ‌ర్ ద్వారక ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నియోజ‌క వ‌ర్గం అయిన కుప్పం నేప‌థ్యంలో సాగే క‌థ గా ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఇటీవ‌ల ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టిస్తూ చిత్ర బృందం ఇన్ ల్యాండ్ లెట‌ర్ పై హీరో హీరో క్యారెక్ట‌ర్ నేమ్ తో పాటు..త‌న రాక కోసం సౌత్ బాంబేకు చెందిన అరుణ్ గౌలి అనే వ్య‌క్తి ఎదురుచూస్తున్న‌ట్టుగా రాసిన ఉత్త‌రంగా చూపించిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఇందులో హీరో సుధీర్ బాబు శివారెడ్డి త‌న‌యుడు సుబ్ర‌మ‌ణ్యంగా క‌నిపించ‌బోతున్నాడు. కుప్పంలో వున్న అత‌నికి సౌత్ బాంబేలో వున్న అరుణ్ గౌలికి వున్న సంబంధం ఏంటీ? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అంతే కాకుండా ఇన్ ల్యాండ్ లెట‌ర్ ఎడ‌మ భాగంలో ఓ టెంపుల్ ని చూపిస్తున్న తీరుని చూస్తుంటే ఈ మూవీలో ఆధ్యాత్మిక అంశాలు కూడా మెయిన్ హైలైట్ గా నిలిచే అవ‌కాశం వుంద‌ని ఫ‌స్ట్ లుక్ కాన్సెప‌క్ట్ పోస్ట‌ర్ ని బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది. అక్టోబ‌ర్ 31న ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభిన్నారు ఈ సంద‌ర్భంగా ఈ మూవీకి టైటిల్ ని ఫైన‌ల్ చేస్తూ కాన్సెప్చువ‌ల్ టైటిల్ వీడియో ఆక‌ట్టుకుంటోంది. ఈ మూవీకి 'హ‌రోమ్ హ‌ర‌' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశారు. 'ది రివోల్ట్‌' అని క్యాప్ష‌న్‌.

ఇంక సెస‌క‌సేదేం లేదు.. చేసేదే'.. అంటూ సుధీర్ బాబు ఈ వీడియోలో విభిన్న‌మైన యాస‌తో చెబుతున్న డైలాగ్ లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం చిరంత‌న్ భ‌ట్‌, సినిమాటోగ్ర‌ఫీ అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌, ఎడిటింగ్ ర‌వితేజ గిరిజాల‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.