Begin typing your search above and press return to search.

ఫోటో షూట్‌: ర‌ణవీర్ లా రౌడీ ప్రయోగశాల‌?

By:  Tupaki Desk   |   19 Dec 2022 4:04 AM GMT
ఫోటో షూట్‌: ర‌ణవీర్ లా రౌడీ ప్రయోగశాల‌?
X
లేటెస్ట్ ఫ్యాష‌న్స్ ని ప‌రిచ‌యం చేయ‌డంలో బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ త‌ర్వాతే ఎవ‌రైనా. అత‌డి ప్ర‌యోగాత్మ‌క శైలి ఎంద‌రికో స్ఫూర్తి. ఖాన్ లు క‌పూర్ లు ఏలే చోట సింగ్ అనే ఒక‌డున్నాడు! అంటే దానికోసం అత‌డు ఎంత విల‌క్ష‌ణంగా ఆలోచిస్తాడో అర్థం చేసుకోవ‌చ్చు. స్టైల్ కంటెంట్ ప‌రంగా ప్ర‌యోగాల ప‌రంగా న‌ట‌న‌లో ఎన‌ర్జీ ప‌రంగా ఎలా చూసినా అత‌డు యూనిక్ అని నిరూపించాడు. గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ రొటీనిటీ నుంచి బ‌య‌ట‌ప‌డి చాలా కాలమైంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా ట్రెండ్ న‌డుస్తోంది. ఏ న‌టుడు అయినా ర‌ణ‌వీర్ లా కొత్తగా వైవిధ్యంగా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంటేనే ఇక్క‌డ ప‌న‌వుతుంది.

ఇది చాలా తెలివిగా గ్ర‌హించిన నేటిత‌రం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే అతిశ‌యోక్తి కాదు. వ‌రుస‌ విజ‌యాల‌ను ఖాతాలో వేసుకునే క్ర‌మంలో అత‌డు కొంత త‌డ‌బ‌డినా త‌న‌ని తాను ప్రెజెంట్ చేసుకోవ‌డంలో టాలీవుడ్ ఫ్యాష‌నిస్టాగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకోవ‌డంలో ఎప్పుడూ తడ‌బ‌డ‌లేదు. దేవ‌ర‌కొండ క‌మ్యూనికేష‌న్ ఏ ఇత‌ర హీరోతో పోల్చినా డిఫ‌రెంట్. అత‌డు జాతీయ మ్యాగ‌జైన్ల‌ ముఖ‌చిత్రాల‌ను ట‌చ్ చేస్తున్నాడు. పాపుల‌ర్ హార్ప‌ర్ బ‌జార్ క‌వ‌ర్ పేజీపై అత‌డి ముఖ‌చిత్రం ప్రింట్ కావ‌డం వెన‌క చాలా వ్యూహం ఉంద‌న‌డంలో సందేహం లేదు. కేవ‌లం కొంద‌రు పేరున్న స్టార్లు బాలీవుడ్ న‌ట‌వార‌సులు మాత్ర‌మే ఈ క‌వ‌ర్ పేజీపై రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తున్నారు. టాలీవుడ్ లో చోటా మోటా హీరోలెవ‌రూ ఇలాంటి ప్ర‌యోగాలు చేసిందేమీ లేదు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి త‌న‌దైన విల‌క్ష‌ణ ఆలోచ‌న‌తో పాపుల‌ర్ 'హార్ప‌ర్ బ‌జార్' క‌వ‌ర్ పేజీపై క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇటీవ‌ల సైలెన్స్ ని బ్రేక్ చేసి ఏడాది ముగింపును ఘ‌నంగా చాటుకోవాల‌నే ప్ర‌య‌త్న‌మే ఇది.

లైగ‌ర్ లాంటి పాన్ ఇండియా డిజాస్ట‌ర్ ని ఎదుర్కొన్న రౌడీ బోయ్ ఇటీవ‌ల సైలెంట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ మ‌రో గీత గోవిందం మ‌రో అర్జున్ రెడ్డి లాంటి బంప‌ర్ హిట్టు ప‌డే వ‌ర‌కూ ఈ సైలెన్స్ ని మెయింటెయిన్ చేస్తూనే.. ఓవైపు ఫ్యాష‌న్ ప్ర‌పంచ‌పు న‌వ్య పంథా పోక‌డ‌ల‌తో యువ‌త‌రాన్ని ఆక‌ర్షించే వ్యూహాన్ని అనుస‌రిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. లైగ‌ర్ తో ముడిప‌డిన కొన్ని వివాదాల సుడిగుండం నుంచి అత‌డు బ‌య‌ట‌పడి ఇప్పుడు హార్ప‌ర్ బ‌జార్ ఫోటోషూట్ తో యూత్ లో హాట్ టాపిక్ అయ్యాడు.

ఇక 2022ని రివ్యూ చేస్తే.. విజయ్ దేవరకొండ ఈ ఏడాది చాలా కార‌ణాల‌తో మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాడు. ముఖ్యంగా జాతీయ మీడియాలో అత‌డి పేరు మార్మోగింది. లైగ‌ర్ షూటింగ్ స‌హా ప్ర‌మోష‌న్స్ తో బోలెడంత బ‌జ్ వ‌చ్చింది. ర‌క‌ర‌కాల‌ బిజీ షెడ్యూల్స్ నుండి అవార్డు ఫంక్షన్ల లో సంద‌డి చేయ‌డం వ‌ర‌కూ... అలాగే విదేశీ వెకేష‌న్స్ లో రిలాక్స్ అవుతూ.. ర‌క‌ర‌కాల‌ సందర్భాల్లో మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చాడు.

ఏడాది ముగింపులో విజ‌య్ మ‌రోసారి త‌న‌ని తాను రీవ్యాంప్ చేసుకుని చార్మర్ లుక్ తో 2022కి స్టైలిష్ గా వీడ్కోలు పలికారు. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ క‌వ‌ర్ పేజీని యూత్ మ‌ర్చిపోలేని విధంగా అలంక‌రించాడ‌ని చెప్పాలి. ముఖ్యంగా అత‌డి లుక్ ప‌రంగా ప్ర‌యోగం ఎన‌ర్జిటిక్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ ని పోలి ఉంది. త‌న ఫేవ‌రెట్ కి అనుక‌ర‌ణ‌గా ప్ర‌యోగాత్మ‌కంగా ఈ ఫోటోషూట్ క‌నిపిస్తోంద‌ని అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఫ్లోర‌ల్ డిజైన్స్ లో అత‌డి లుక్ గాళ్స్ కి స్పెష‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. పింక్ సూట్ లో విజ‌య్ చాక్లెట్ బోయ్ నే త‌ల‌పిస్తున్నాడు.

ముంబైలోనే ఎక్కువ సమ‌యం..! లైగర్ సినిమా అన్ని భాషల్లోనూ ఫ్లాప్ అయినప్పటి నుంచి విజయ్ దేవరకొండ సైలెంట్ అయిపోయాడు. అతడు ఇటీవ‌ల‌ ఏ చిత్రానికి సంతకం చేయలేదు. సమంతతో క‌లిసి 'ఖుషి' షూటింగ్ మిన‌హా వేరొక సినిమాకి క‌మిట‌వ్వ‌లేదు. ఇటీవ‌ల కొంత‌కాలంగా విజయ్ ముంబైలో ఉన్నాడని క‌థ‌నాలొస్తున్నాయి. అక్క‌డ‌ మెహబూబ్ స్టూడియోలో థమ్స్ అప్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. విజయ్ ఒక హిందీ దర్శకుడిని కలవడానికి అలాగే కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా క‌థ‌నాలొచ్చాయి.

కొంత‌కాలంగా సోషల్ మీడియాలో కూడా ఎందుక‌నో సైలెంట్ గా ఉన్నాడు. లేటెస్టుగా హార్ప‌ర్ బ‌జార్ క‌వ‌ర్ పేజీతో ఈ సైలెన్స్ కి చెక్ పెట్టాడు. విజ‌య్ ప్ర‌స్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న‌ ఖుషి చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం 2023లో థియేటర్లలో విడుదల కానుంది. ప్ర‌స్తుతం రౌడీ బోయ్ విజ‌య్ సోదరుడు ఆనంద్ దేవరకొండ సాయి రాజేష్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం 'బేబీ'తో సిద్ధంగా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.