Begin typing your search above and press return to search.
పెద్దయితే బెబో అంత అవుతుందిట
By: Tupaki Desk | 22 July 2015 5:37 AM GMTసల్మాన్ భజరంగి భాయిజాన్ సూపర్ హిట్ అయ్యింది. భాయ్ కి మంచి మార్కులే వేశారు క్రిటిక్స్. తనతో పాటే ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన ఓ చిన్నారి పాపకు కూడా అంతే మార్కులు పడ్డాయి. తొలి ప్రయత్నమే ఈ బేబి షాహిదా పాత్ర లో ఎంతో గొప్పగా నటించిందని, షో స్టాపర్ అంటూ పొగిడేశారు.
పేరు హర్షాలీ మల్హోత్రా(7). కాజల్ మల్హోత్రాకి తనయురాలు. ప్రస్తుతం స్కూలుకెళుతోంది. కాబట్టి భజరంగి షూటింగులోనే హోమ్ వర్క్ చేసుకునేది. అలాగే క్లాస్ లో మెరిట్ స్టూడెంట్. పెద్దయ్యాక ఏమవుతావ్? అని ప్రశ్నిస్తే కరీనకపూర్, కత్రినకైఫ్ అంత పెద్ద స్టార్ అవుతానని చెబుతోంది. అంతేనా సల్లూభాయ్ ని సల్లూ మామ అని పిలిచేస్తూ.. మొదటిరోజు పరిచయం అవ్వగానే ఏమాత్రం జంకూ గొంకు లేకుండా ఇంటరాగేషన్ చేసేసింది. నీ అంత అవ్వాలంటే ఏం చేయాలో చెప్పు? అని ప్రశ్నించింది.
చిచ్చూకి యాక్షన్ సినిమాలు, తుపాకీ పేలుళ్లు అస్సలు నచ్చవు. అందుకే భజరంగి టైమ్ లో తుపాకీ కాల్పులు వినిపించినప్పుడు ఏడ్చేసేది. అయితే సల్మాన్, కబీర్ ఖాన్, సిద్ధిఖీ వంటి వారితో స్నోబాల్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటలు ఆడుతూ ఫ్రెండయిపోయింది కాబట్టి సినిమాలో లీనమై నటించేసింది. అదీ సంగతి.