Begin typing your search above and press return to search.
‘మనం’ సినిమా.. మాటల కథ
By: Tupaki Desk | 11 May 2018 5:46 AM GMTఅక్కినేని కుటుంబం తరతరాలుగా గుర్తుంచుకునే సినిమాగా మిగిలిపోయింది ‘మనం’. అలాంటి గొప్ప చిత్రానికి మాటలు రాశాడు నటుడు హర్షవర్ధన్. ఐతే ముందు ఈ చిత్రానికి అతను రైటర్ కాదట. అప్పటికే ‘ఇష్క్’ సినిమాకు విక్రమ్ తో కలిసి పని చేసిన హర్ష.. అనివార్య కారణాల వల్ల ‘మనం’ సినిమాకు దూరం కావాల్సి వచ్చిందట. కానీ చివరికి అనూహ్య పరిస్థితుల్లో ‘మనం’లో మళ్లీ భాగస్వామి అయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘ఇష్క్’ సినిమాకు తన పనితీరు చూసి ఇంప్రెస్ అయిన విక్రమ్ కుమార్ ఇకపై తన ప్రతి సినిమాకూ పని చేయాలని చెప్పాడట. కానీ ‘మనం’ మొదలుపెట్టే సమయానికి ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ప్రాజెక్టులో బిజీగా ఉన్న తనను ఉన్నఫలంగా వచ్చేయమని విక్రమ్ చెప్పినట్లు హర్ష వెల్లడించాడు. ఐతే ఆ చిత్రానికి కథతో పాటు మాటలు రాశానని.. దాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నానని.. సినిమా షూటింగ్ కూడా అయ్యేవరకు బయటికి రావొద్దనుకున్నానని హర్ష చెప్పాడు.
ఈ విషయం విక్రమ్ కు చెబితే అలిగి వెళ్లిపోయాడని.. వేరే రచయితలు చాలామందిని ట్రై చేశారని.. అందులో పెద్ద పెద్దవాళ్లు ఉన్నట్లు తెలిసిందని.. కానీ ఎవరితోనూ విక్రమ్ కు సింక్ అవ్వక చివరికి తననే అడిగారని హర్ష చెప్పాడు. తాను రాసిన సీన్లు.. మాటలు నాగార్జునకు చాలా బాగా నచ్చాయని.. తాను కూడా చాలా ప్రత్యేకంగా భావించి ఆ సినిమాకు మాటలు రాశానని హర్ష చెప్పాడు. విక్రమ్ కుమార్ తర్వాత తీసిన ‘24’.. ‘హలో’ సినిమాలకు కూడా తాను పని చేయాల్సిందని.. కానీ దురదృష్టవశాత్తూ కుదరలేదని చెప్పాడు హర్ష.