Begin typing your search above and press return to search.

అక్క ఫ్రెండ్ తో తమ్ముడు వేషాలా??

By:  Tupaki Desk   |   9 Feb 2017 4:56 PM GMT
అక్క ఫ్రెండ్ తో తమ్ముడు వేషాలా??
X
సాహసం శ్వాసగా సాగిపో మూవీలో అమ్మాయిల విషయంలో నాగచైతన్య ఓ స్ట్రాటజీ చెబుతాడు. 'ఫ్రెండ్ చెల్లి మనకి చెల్లి అవుతుంది కానీ.. ఆ చెల్లి ఫ్రెండ్ మనకు చెల్లి అవాల్సిన అవసరం లేదుగా' అంటాడు నాగచైతన్య. డీమానిటైజేషన్ దెబ్బకి ఈ మూవీని జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇలాంటి పంచ్ లు బాగానే ఉంటాయ్. ఇప్పుడు చైతు చెప్పిన ఆ స్ట్రాటజీని.. సోనమ్ కపూర్ తమ్ముడు హర్షవర్ధన్ కపూర్ పక్కాగా ఫాలో అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కి.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి మాంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆఫ్ స్క్రీన్ ఈ ముద్దుగుమ్మలు ఇద్దరూ భలే సందడి చేస్తుంటారు. తన అక్క ఫ్రెండ్ అయిన జాక్వెలిన్ తో కలిసి ఇప్పుడు కుర్ర హీరో హర్షవర్ధన్ కపూర్ ఓ ఫోటో షూట్ చేశాడు. బజార్ బ్రైడ్ మేగజైన్ చేసిన ఈ హాట్ హాట్ ఫోటోషూట్.. ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇందుకు కారణం.. హర్షవర్ధన్ లుక్ కంటే.. శ్రీలంక అందం జాక్వెలిన్ రెచ్చిపోయిన తీరే. ఫ్రంట్ ఓపెన్ అన్నట్లుగా ఫుల్ లెంగ్త్ లో క్లీవేజ్ చూపిస్తూ అమ్మడు ఓ డ్రెస్ వేస్తే.. ఆమె నడుం వెనుక నుంచి చెయ్యి మెలేసి.. ఆమె రెండో చేతిని పట్టుకుని కిక్ ఎక్కించే పోజ్ ఇచ్చాడు హర్షవర్ధన్ కపూర్.

అక్క ఫ్రెండ్ తనకు అక్క అవాల్సిన అవాల్సిన పనేమీ లేదని ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నాడు హర్షవర్ధన్. అందుకే ఇంతగా రెచ్చిపోగలిగాడు. ఇతగాడు హీరోగా అరంగేట్రం చేసిన మిర్జియా నిరుత్సాహపరిచినా.. కుర్రాడికి డిమాండ్ బాగానే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/