Begin typing your search above and press return to search.

కాబోయే బావ గురించి కుర్ర హీరో కబుర్లు

By:  Tupaki Desk   |   4 May 2018 4:21 AM GMT
కాబోయే బావ గురించి కుర్ర హీరో కబుర్లు
X
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ పెళ్లి కూతురు అయిపోతోంది. ఈ నెల 8న ముంబైలో సోనమ్ పెళ్లి ఫిక్స్ కాగా.. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఇన్విటేషన్స్ వెబ్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడుతోంది సోనమ్.

సోనమ్ కపూర్ తమ్ముడు హర్షవర్ధన్ కపూర్.. ఈ పెళ్లి గురించి కాకుండా.. తన కాబోయే బావ గురించి బోలెడు చెబుతున్నాడు. ప్రస్తుతం 'భవేష్ జోషి.. సూపర్ హీరో' అంటూ ఓ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో.. ఎక్కువగా ఆ పనుల్లోనే ఉండిపోయాడట ఈ కుర్రాడు. అందుకే అక్క పెళ్లి ఏర్పాట్లు ఎక్కడివరకూ వచ్చాయో తెలీదని అంటున్నాడు. ఒకవైపు స్వయంగా పెళ్లి కూతురే తన సినిమా 'వీరే ది వెడ్డింగ్' కు ప్రచారం చేసుకుంటూ.. పెళ్లి హంగామాకు ప్రిపేర్ అవుతుంటే.. హర్షవర్ధన్ మాత్రం జోకులేస్తున్నాడు. ఆనంద్ చాలా గొప్ప వ్యక్తి అంటున్న హర్ష.. వారిద్దరి జంట అద్భుతంగా ఉంటుందని.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెబుతున్నాడు.

అక్కకు ఇవ్వబోయే పెళ్లి కానుక ఏంటో కూడా చెప్పాడు హర్షవర్ధన్ కపూర్. తాను ప్రత్యేకంగా బహుమతులు ఏవీ ఇవ్వడం లేదని.. ఆప్యాయంగా కౌగిలించుకుని బెస్టాఫ్ లక్ చెబుతానని అంటున్నాడు. తనకు బ్రేకప్ బాధ తెలుసు అని.. అందుకే వారికి మంచి జరగాలని మనసారా కోరుకుంటానని.. అప్పుడే వేదాంతం మాదిరిగా మాట్లాడేస్తున్నాడు ఈ కుర్ర హీరో.