Begin typing your search above and press return to search.
స్టార్ హీరో వారసుడు రఫ్ కట్ లో అదిరాడు
By: Tupaki Desk | 24 Jun 2016 5:31 PM GMTస్టార్ హీరోల వారసులు తెరంగేట్రం చేస్తున్నారంటే.. ఇండస్ట్రీతో పాటు ఆ స్టార్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే అరంగేట్ర మూవీ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ అరంగేట్రం చేస్తున్నాడు. మిర్జియా అంటూ రెండు స్టోరీలను లింక్ చేస్తూ తీసిన సినిమాతో ఈ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హర్షవర్ధన్.
సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ.. మీర్జా షాహిబాకు చెందిన కథగా చెబుతున్నారు. ఆ పాత పురాణానికి లేటెస్ట్ స్టోరీని మిక్స్ చేస్తూ ఓ రేంజ్ లో విజువల్స్ ను చూపించారు. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే.. రామ్ చరణ్ మగధీర గుర్తుకురాకపోతే ఒట్టు. చేతులు తాకుతూ విడిపోవడం, గుర్రాల ఎపిసోడ్ లు... యుద్ధాలు.. పాతకథని దాదాపు దించేశారనే ఫీలింగ్ కలగడం సహజం.
ఇక ప్రజెంట్ జనరేషన్ స్టోరీ విషయానికొస్తే.. ఇక్కడో ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెట్ చేశారు. హీరోయిన్ వెళ్లి విలన్ తో ప్రేమలో పడిపోతుంది. హీరో తెగ భారంగా ఫీలయిపోతూ ఉంటాడు. హీరో హీరోయిన్లు మరుసటి జన్మలో ఎలా కలుసుకున్నారన్నదే కాన్సెప్ట్. మొత్తానికి తెలిసిన కథనే దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా బాలీవుడ్ స్టైల్లో తెరకెక్కించాడు. అనిల్ కపూర్ కొడుకు.. సోనమ్ కపూర్ సోదరుడు అయిన హర్షవర్ధన్ కపూర్ లుక్ బాగానే ఉంది. రెండు రకాల గెటప్స్ తో ఆకట్టుకున్నాడు. రఫ్ లుక్ లో అయితే ఇరగదీసేశాడని చెప్పాలి.