Begin typing your search above and press return to search.

నాలో తేడా ఉందేమో అంటున్న కుర్ర హీరో

By:  Tupaki Desk   |   23 Sep 2016 7:30 PM GMT
నాలో తేడా ఉందేమో అంటున్న కుర్ర హీరో
X
బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న మరో వారసుడు హర్షవర్ధన్ కపూర్. అనిల్ కపూర్ కుమారుడిగా.. కపూర్ ల వంశానికి వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఈ హీరోపై అంచనాలు చాలానే ఉన్నాయి. సయామీ ఖేర్ తో జోడీ కట్టి.. మిర్జియా మూవీలో నటించా.. ఇప్పుడా మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సోదరుడి సినిమా కోసం సోనమ్ కపూర్ చేస్తున్న ప్రచారం.. మిర్జియాకు బాగా కలిసొచ్చే అంశంగా బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మరోవైపు హర్ష వర్ధన్- సయామీ లు కూడా పబ్లిసిటీ కోసం తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో అనిల్ కపూర్ కొడుకు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయిపోయాయి. ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ కుర్రాడు.. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా సినిమాతో కెరీర్ స్టార్ట్ చేయడంపై ముందునుంచీ అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా యష్ రాజ్ ఫిలింస్.. ధర్మ ప్రొడక్షన్స్ వంటి ప్రఖ్యాత బేనర్లు.. ఇతగాడి కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండేవే. మరి ఆ బ్యానర్లలో కాకుండా.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్న.. హర్షవర్ధన్ కి ఎదురైంది.

'యష్ రాజ్ ఫిలింస్.. ధర్మ ప్రొడక్షన్స్ నాకు ఆఫర్ ఇవ్వలేదు. రాకేష్ ఓంప్రకాష్.. విక్రమాదిత్య మొత్వానీ.. శ్రీరామ్ రాఘవన్ లాంటి వారే అవకాశం ఇచ్చారు. అలా ఎందుకు జరిగిందో నాకు తెలుసు. బహుశా నాలో ఏదో తేడా ఉందేమో' అంటూ అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ పై.. ఇప్పుడు బాలీవుడ్ లో బోలెడన్ని చర్చలు జరుగుతున్నాయి.