Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో రాజమండ్రి కుర్రాడి తిప్పలు
By: Tupaki Desk | 16 Feb 2016 9:30 AM GMTహర్షవర్ధన్ రాణే.. అచ్చమైన తెలుగు నటుడు. తకిట తకిట - అవును - ప్రేమ ఇష్క్ కాదల్ వంటి చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న ఈ హీరో.. ఇప్పుడు బాలీవుడ్ లో తన ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. పేరు వింటే నార్త్ ఇండియన్ అనో.. హైద్రాబాద్ వాసి అనో అనిపిస్తుంది కానీ.. ఈ హీరోది నేటివ్ గా రాజమండ్రి - ఈయన తండ్రి నార్త్ ఇండియన్ కావడంతో.. ఇలా హర్షవర్ధన్ రాణే అనే పేరు డిఫరెంట్ నేమ్ వచ్చింది.
విగ్రహం పుష్టిగా ఉండడంతో.. బాలీవుడ్ ఆఫర్స్ త్వరగానే వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుని హిందీ హీరో కూడా అయిపోయాడు. రీసెంట్ గా ఇతను నటించిన సనమ్ తేరీ కసమ్ మూవీ రిలీజ్ కూడా అయింది. కానీ సరైన పబ్లిసిటీ లేకపోవడం, మౌత్ పబ్లిసిటీతో ఆడేసేంతటి కంటెంట్ లేకపోవడంతో.. చివరకు ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయినాసరే హర్షవర్ధన్ చేతిలో ప్రస్తుతం ఇంకో ప్రాజెక్ట్ ఉంది. సత్రా కో షాదీ హై చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి కాగా.. త్వరలో రిలీజ్ కు కూడా రెడీ కానుంది. ఈ మూవీతో అయినా బాలీవుడ్ లో తన ఫేట్ మారుతుందని ఈ రాజమండ్రి కుర్రాడు ఆశలు పెట్టుకున్నాడు.
ఇతనే కాదు.. ఏపీ - తెలంగాణ - తమిళనాడుల్లో సత్తా చాటుతూ మంచి నటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ అంజలి కూడా ఇక్కడి అమ్మాయే. అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటి జయప్రద కూడా రాజమండ్రి వాసే కావడం విశేషం.