Begin typing your search above and press return to search.

మణిరత్నం క్లాసిక్ లో.. ధనుష్‌ పక్కన..

By:  Tupaki Desk   |   27 July 2016 5:26 AM GMT
మణిరత్నం క్లాసిక్ లో.. ధనుష్‌ పక్కన..
X
టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణే.. ఈ మధ్య తన మకాం పూర్తిగా ముంబైకి మార్చేశాడు. ఇక్కడ దాదాపు ఓ పది సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టం వెతుక్కుంటున్నాడు. ఇప్పటికే రెండు హిందీ సినిమాలు రిలీజ్ చేసేశాడు కూడా.

సత్రా కో షాదీ హై.. సనమ్ తేరీ కసమ్.. చిత్రాలతో బాలీవుడ్ లో సంచలనం సృష్టిద్దాం అనుకున్నాడు హర్షవర్ధన్. కాని ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదు. అయితే ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తీసిన క్లాసిక్ మూవీ ఘర్షణను.. హిందీలో రీమేక్ చేయనున్నారు. బాలీవుడ్ వెర్షన్ ని బెజోయ్ నంబియార్ తీస్తుండగా.. ఇందులో ధనుష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఒరిజినల్ లో కార్తీక్ పోషించిన పాత్రను ధనుష్ చేస్తుండగా.. ప్రభు పాత్రలో హర్షవర్ధన్ రాణేను ఫైనల్ చేశారట. సరైన సినిమాలు ఒక్కటీ చేయకపోయినా కూడా.. అసలు హర్షవర్దన్ కు ఇలా ఆఫర్లు వెతుక్కుంటూ రావడం చాలా పెద్ద విషయమే.

నిజానికి బాలీవుడ్ లో ఎవరో ఒక గాడ్ ఫాథర్‌ అండ లేకపోతే ఛాన్సులు రావంటారు. చూస్తుంటే మనోడికి కూడా ఈ మధ్యనే జాన్ అబ్రహాంతో ఏర్పడిన పరిచయం కారణంగా ఇన్నేసి ఛాన్సులు వస్తున్నాయని బాలీవుడ్ టాక్‌. ఇప్పటికైనా మరి కుర్రాడు ప్రూవ్ చేసుకుంటాడా?