Begin typing your search above and press return to search.
వేధింపుల రాక్షసుడికి జైలు కూడు
By: Tupaki Desk | 25 Feb 2020 8:00 AM GMTమీటూ వేదికగా వేధింపులకు పాల్పడిన పలువురు టాప్ సెలబ్రిటీల పేర్లు ఇటీవల వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అందులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్( 67) పేరు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. రెండేళ్లుగా అతడి పేరు మీడియాలో నిరంతరం చర్చకు వస్తోంది. అతడు ఏకంగా 80 మంది నటీమణులపై వేధింపులకు పాల్పడ్డాడన్నది అభియోగం. ఆయన వేధింపులకు కొందరు నటులు కూడా బలయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణలో కొన్ని నేరాలు రుజువయ్యాయి. ఒకరిద్దరి విషయంలో కోర్టు తీర్పు వీన్ స్టీన్ కి అనుకూలంగా వచ్చినా మెజారిటీ నేరాలు రుజువయ్యాయి.
2006లో మీమీ హలేయిని.. 2013లో జెస్సికా మన్ .. వీన్ స్టీన్ ఘాతుకానికి బలయ్యారని నివేదిక పేర్కొంది. 12 మందితో కూడుకున్న న్యూయార్క్ జ్యూరీ తాజాగా తీర్పును వెలువరించగా... వేధింపులు నిజమేనని నిగ్గు తేల్చి వెంటనే జైలుకు పంపాలని ఆదేశించారు. ఇకపైనా ఈ కేసులో లోతుగా దర్యాప్తు సాగించనున్నారు. ఇతర నేరాలు రుజువైతే అతడికి జీవిత ఖైదు ఖాయమేనట. మార్చి 11న శిక్షను ఖరారు చేసే వీలుందని తెలుస్తోంది.
అయితే ఈ కేసులో వీన్ స్టీన్ తరపు న్యాయవాది భిన్న వాదనలు వినిపించారు. చాలా మంది తాజా పరిణామాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేశారని.. తారలుగా వెలగాలని ఇలా చేస్తున్నారని వాదించిన లాయర్ .. ఆయనతో సంబంధాలు కొనసాగించిన వారే ఇప్పుడు రేప్ అంటూ వాధిస్తున్నారని కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు. రేప్ అని చెప్పిన తేదీ తర్వాతా సదరు నటీమణులు అతడితో శృంగారంలో పాల్గొన్నారన్న వాదనను తెరపైకి తెచ్చారు. తాజా విచారణలో 17ఏళ్ల లోపు మైనర్ బాలికలపై జరిగే అత్యాచారాన్ని మొదటి డిగ్రీ రేప్ గా న్యూయార్క్ పోలీస్-కోర్టులు పరిగణిస్తాయని తెలిసింది. ఈ కేసు విషయంలోనూ విచారణ సాగుతోంది. ఇక వీన్ స్టీన్ ప్రతిభ పై బోలెడన్ని ప్రశంసలు హాలీవుడ్ లో ఉన్నాయి. అవార్డులు రివార్డులకు కొదవేమీ లేదు. ది ఇంగ్లీష్ పేషెంట్.. షేక్స్‌పియర్ ఇన్ లవ్ (ఆస్కార్ ఉత్తమ చిత్రం) చిత్రాలతో నిర్మాతగా అతడికి అసాధారణ పాపులారిటీ దక్కింది.