Begin typing your search above and press return to search.

గూఢ‌చారి బాలీవుడ్ జంప్

By:  Tupaki Desk   |   26 Dec 2018 10:29 AM GMT
గూఢ‌చారి బాలీవుడ్ జంప్
X
2016లో అమీ తుమీ, 2017లో క్ష‌ణం, 2018లో గూఢ‌చారి .. ఇలా వ‌రుస సంవత్స‌రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్లు త‌న కెరీర్ కి యాడ‌య్యాయ‌ని రెట్టించిన‌ కాన్ఫిడెన్స్ ని వ్య‌క్తం చేస్తున్నారు అడివి శేష్. ఈ న‌వ‌త‌రం హీరో ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో టాలీవుడ్ లో కెరీర్ ని మ‌లుచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. `క‌ర్మ` అనే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా, హీరోగా టాలీవుడ్ లో ప్ర‌వేశించిన శేష్ చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌థానాయ‌కుడిగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు.

2018 త‌న‌కు క‌లిసొచ్చిన సంవ‌త్స‌రం. `గూఢ‌చారి` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకుని రెట్టించిన కాన్ఫిడెన్స్ తో దూసుకొస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సంవ‌త్స‌రంలో కేవ‌లం ఏ ఒక్క భాష‌కో కాదు.. అన్ని భాష‌ల్లోనూ త‌న పాపులారిటీ పెంచుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు. అలాగే బాలీవుడ్ లోనూ న‌టించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అంతేనా.. పాన్ ఇండియా హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకునేందుకు సరికొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు వెళుతున్నాన‌ని తెలిపాడు. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో అడివి శేష్ భ‌విష్య‌త్ గురించిన‌ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని తెలిపాడు. కేవ‌లం హీరోగానే కాదు, ద‌ర్శ‌కుడిగానూ ప్రూవ్ చేసుకుంటాన‌ని చెబుతున్న శేష్ త‌న‌కు హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీసే స‌త్తా ఉంద‌ని కాన్ఫిడెన్స్ ని వ్య‌క్తం చేశాడు. `గూఢ‌చారి` క‌థ 14 ఏళ్లుగా బుర్ర‌లో మెదులుతూనే ఉంది. రెండేళ్లుగా దీనిపై క‌స‌ర‌త్తు చేసి ఇప్ప‌టికి రిలీజ్ చేసి విజ‌యం అందుకున్నాం అని తెలిపాడు. భ‌విష్య‌త్ లో పాన్ ఇండియా (యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టుల‌తో) సినిమాల్లో న‌టించే ఆలోచ‌న ఉంద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి మ‌రీ చెబుతున్నాడు.

న‌వ‌త‌రం హీరోల ఆలోచ‌నా శైలి మారింది. ఏ ఒక్క ప్రాంతీయ భాష‌కో ప‌రిమితం కాకుండా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న సినిమాల్లో న‌టించాల‌న్న కుతూహాలం పెరుగుతోంది. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌భాస్, రానా లాంటి స్టార్లు ముంద‌డుగు వేశారు. మ‌రింత‌మంది యువ‌త‌రం హీరోల ఆలోచ‌న ఆ దిశ‌గా సాగుతోంది. ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ రాణించాల‌న్న ఉత్సాహం క‌నిపిస్తోంది. ఆ కేట‌గిరీలో ఇప్పుడు అడివి శేష్ పేరు చేర‌బోతోంది. అత‌డు బాలీవుడ్ లోనూ స‌క్సెసైతే బ‌హుభాషా చిత్రాల క‌థానాయ‌కుడిగా త‌న‌ని తాను ఎలాబ‌రేట్ చేసుకునే ఛాన్స్‌ క‌లుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

శేష్ ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రం `భాఘి 2`కి ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్నాడు. ఆ కాంటాక్ట్స్ తో అక్క‌డా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకునే ఆలోచ‌న‌లోనూ శేష్ ఉన్నాడు. ప్ర‌స్తుతం `గూఢ‌చారి 2` చిత్రానికి సంబంధించిన క‌థ‌ను రాస్తున్నాడు. శేష్ చెబుతున్న మాట‌ల్ని బ‌ట్టి బ‌హుశా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా త‌ర‌హాలో బాలీవుడ్ టై అప్ తో ఉండే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దిమాకున్నోడు దునియా మొత్తం చూడాలి. శేష్ ఆ ప‌నే చేస్తున్నాడ‌న్న‌మాట‌!!