Begin typing your search above and press return to search.
100 కోట్ల దర్శకుడి వల్ల అయ్యేనా ?
By: Tupaki Desk | 26 Jan 2019 6:04 AM GMTసంక్రాంతి రేస్ లో తక్కువ అంచనాలతో వచ్చి ఏకంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి డిమాండ్ మాములుగా లేదు. తనతో చేయాలనీ సీనియర్లు మొదలుకుని అప్ కమింగ్ యూత్ స్టార్స్ వరకు అందరూ ఉత్సాహపడుతున్నారు. తన తర్వాత సినిమా ఎవరితో అనే విషయంలో చిన్న క్లూ కూడా ఇవ్వకుండా తెలివిగా సమాధానం చెబుతున్న అనిల్ ఇటీవలే ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అందులో కళ్యాణ్ రామ్ తో పటాస్ రూపంలో డెబ్యుతోనే బంపర్ హిట్ కొట్టిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఓ కథ చెప్పాడట.
అయితే లైన్ నచ్చిన యంగ్ టైగర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తే మొదలుపెడదామని చెప్పినా అప్పుడు సమయాభావం వల్ల ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయినట్టు చెప్పాడు. అంటే ఇప్పుడు కనక ఛాన్స్ వస్తా వదిలిపెట్టే సమస్యే లేదన్న కాన్ఫిడెన్స్ అతని మాటల్లో కనిపించింది. అయితే అప్పటి సంగతి ఏమో కాని ఇప్పుడు సిచువేషన్ వేరు. తారక్ ఇంకో ఏడాదిన్నర దాకా ఆర్ ఆర్ ఆర్ లోనే బిజీగా ఉంటాడు. తర్వాత మరో రెండు కమిట్మెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఒకవేళ అనిల్ రావిపూడి చేయలన్నా ఇప్పటిప్పుడు సాధ్యం కాదు. అయితే అనిల్ రావిపూడి ఇప్పటిదాకా పెద్ద యూత్ మాస్ హీరోతో చేయలేదు.
రవితేజ-వెంకటేష్ సీనియర్లు కాబట్టి కామెడీ టైమింగ్ తో నెట్టుకొచ్చాడు. కళ్యాణ్ రామ్ కు ఇమేజ్ లేకపోవడం పటాస్ టైంలో ప్లస్ అయ్యింది. తేజు మార్కెట్ సుప్రీమ్ టైం లో చిన్నది కాబట్టి రిస్క్ సులభమయ్యింది. కాని జూనియర్ కేసు వేరు. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవాల్సిన ఒత్తిడి ఉంటుంది. కేవలం ఎంటర్ టైన్మెంట్ తో మెప్పించలేం. బలమైన మసాలాలు పడాలి. మరి అనిల్ రావిపూడి అలాంటి కథ ఉందో లేదో రెండేళ్ళ తర్వాతైనా అలాంటి స్క్రిప్ట్ ని రెడీ చేసుకుంటాడేమో చూడాలి