Begin typing your search above and press return to search.

భర్త కోసం స్టార్‌ హీరోయిన్‌ సినిమాలకు గుడ్‌ బై

By:  Tupaki Desk   |   11 April 2019 10:12 AM GMT
భర్త కోసం స్టార్‌ హీరోయిన్‌ సినిమాలకు గుడ్‌ బై
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ 2017వ సంవత్సరంలో టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. సుదీర్ఘంగా ప్రేమించుకున్న వీరిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత విరాట్‌ కోహ్లీ పలు సిరీస్‌ లలో అద్బుత విజయాలను దక్కించుకున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో పలు రికార్డు బ్రేకింగ్‌ విక్టరీలు అందుకున్న టీం ఇండియా త్వరలో ప్రపంచ కప్‌ ను ఆడబోతున్న విషయం తెల్సిందే. ప్రపంచకప్‌ ఫేవరేట్‌ జట్టుగా టీం ఇండియా బరిలోకి దిగ బోతుంది. టీం ఇండియాకు కోహ్లీ కెప్టెన్‌ గా వ్యవహరించబోతున్నాడు.

మెగా టోర్నమెంట్‌ లో పాల్గొనబోతున్న కోహ్లీ దేశంకు సారధ్యం వహించబోతున్న నేపథ్యంలో ఆయన వెన్నంటి ఉండాలని అనుష్క శర్మ భావిస్తోందట. అందుకే ప్రపంచ కప్‌ పూర్తి అయ్యే వరకు ఏ సినిమాలో నటించవద్దనే నిర్ణయానికి వచ్చిందని బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జీరో చిత్రం తర్వాత అనుష్క శర్మ నిర్మాణంపై ఎక్కువ శ్రద్ద పెడుతూ నటనకు దూరంగా ఉంటూ వస్తోంది. తన బ్యానర్‌ లో కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్న అనుష్క శర్మ త్వరలో వాటిని కూడా పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

భర్తకు మద్దతుగా ప్రపంచ కప్‌ సమయంలో ఉండాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేయడం లేదనే వార్తలు జోరుగా వస్తున్న ఈ సమయంలోనే మరో వైపు అనుష్క ఇక సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పేసినట్లే అని, వైవాహిక జీవితంను ఎంజాయ్‌ చేసే ఉద్దేశ్యంతో అనుష్క సినిమాలకు గుడ్‌ బై చెప్పిందని అంటున్నారు. కోహ్లీ క్రికెటర్‌ కావడంతో ఎక్కువ ఆటకే సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే సమయంలో అనుష్క నటిస్తూ ఉంటే ఆమె ఎక్కువగా నటనకు టైం కేటాయించాల్సి వస్తుంది. దాంతో ఇద్దరు కలవడమే తక్కువ అయ్యిందట. దాంతో అనుష్క లైఫ్‌ ను ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రపంచ కప్‌ తర్వాత అయినా అనుష్క హీరోయిన్‌ గా చేస్తుందా లేదంటే గుడ్‌ బై చెప్పినట్లేనా అనేది సమ్మర్‌ తర్వాత తేలే అవకాశం ఉంది.