Begin typing your search above and press return to search.
క్రిష్ ను టాప్ లో చేర్చిన బాలయ్య!
By: Tupaki Desk | 3 Jan 2019 11:18 AM GMTనందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ సంక్రాంతికి మొదటి పార్ట్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ బయోపిక్ కోసం బాలయ్య ఎంతో మంది దర్శకులను సంప్రదించాడు, పరిశీలించాడు. చివరకు తేజతో సినిమాను మొదలు పెట్టాడు. మొదటి నుండి క్రిష్ పై బాలయ్య గురి ఉన్నప్పటికి క్రిష్ బాలీవుడ్ లో మూవీ చేస్తున్న కారణంగా ఆయన కాదంటూ వచ్చాడు. ఎప్పుడైతే బాలీవుడ్ లో మణికర్ణిక నుండి క్రిష్ తప్పుకున్నాడో వెంటనే బాలయ్య ‘ఎన్టీఆర్’ బయోపిక్ బాధ్యతలు క్రిష్ కు అప్పగించాడు. క్రిష్ తనపై పెట్టిన నమ్మకంను పూర్తిగా నిలబెట్టుకున్నాడు.
క్రిష్ ఎంట్రీతో ‘ఎన్టీఆర్’ సినిమా పూర్తిగా మారిపోయింది. తనదైన శైలిలో స్క్రీన్ ప్లేను మార్చడంతో పాటు, ఒక్కో పాత్రను డిజైన్ చేశాడు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కడం వల్ల ఈ స్థాయిలో క్రేజ్ దక్కి, భారీ బిజినెస్ జరిగింది. కాని వేరే ఏ దర్శకుడు అయినా ఈ స్థాయిలో క్రేజ్ పెరిగేది కాదేమో. రెండు పార్ట్ లు కూడా భారీ మొత్తంలో అమ్ముడు పోయిన నేపథ్యంలో క్రిష్ కు 10 కోట్ల రూపాయల పారితోషికంను బాలయ్య ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
టాలీవుడ్ లో టాప్ దర్శకులు మాత్రమే ఈ భారీ పారితోషికం అందుకుంటూ ఉన్నారు. పది కోట్లు, ఆపై పారితోషికం తీసుకునే వారు అతి కొద్ది మందే. ఆ కొద్ది మంది టాప్ దర్శకుల జాబితాలో క్రిష్ చేరిపోయాడు. క్రిష్ గత చిత్రాల పారితోషికాలతో పోల్చితే ఇది డబుల్ కు ఎక్కువ అని చెప్పాలి. బాలయ్య భారీ పారితోషికం ఇవ్వడంతో క్రిష్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. ‘ఎన్టీఆర్’ సక్సెస్ అయితే క్రిష్ తదుపరి చిత్రం పారితోషికం మరింతగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.