Begin typing your search above and press return to search.

Sep 23 నుంచే ద‌స‌రా హంగామా మొద‌లైందా?

By:  Tupaki Desk   |   20 Sep 2022 5:30 PM GMT
Sep 23 నుంచే ద‌స‌రా హంగామా మొద‌లైందా?
X
టాలీవుడ్ సినిమాల‌కు ముఖ్యంగా మూడు సీజ‌న్ లు కీల‌కంగా నిలుస్తుంటాయి. సంక్రాంతి, ద‌స‌రా, స‌మ్మ‌ర్‌.. వీటితో పాటు దీపావ‌ళి స‌మ‌రం కూడా కొంత మేర ఆస‌క్తిక‌రంగా మారుతూ వుంటుంది. ప్ర‌ధానంగా అయితే ప్ర‌తీ హీరో, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ సంక్రాంతి, ద‌స‌రా, స‌మ్మ‌ర్ సీజ‌న్ ల‌నే టార్గెట్ గా భావిస్తుంటారు. ఈ స‌మ‌యంలో త‌మ సినిమాల‌ని ప్ర‌ధానంగా పోటీకి దింపుతుంటారు. కొంత మంది హీరోల‌కు ఈ మూడు సీజ‌న్ లు సెంటిమెంట్ లుగా కూడా మారిన విష‌యం తెలిసిందే.

కొంత మంది హీరోల‌కు సంక్రాంతి సెంటిమెంట్ గా మారితే మ‌రి కొంత మంది హీరోల‌కు ద‌స‌రా, స‌మ్మ‌ర్ సెంటిమెంట్ గా నిలుస్తోంది. ఇదిలా వుంటే ఇప్పుడు ద‌స‌రా సీజ‌న్ వ‌చ్చేసింది. ఈ సీజ‌న్ లో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల తాకిడి భారీగా వుంటుంది కాబ‌ట్టి చిన్న హీరోల నుంచి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కు పోటీప‌డుతున్నారు. సెప్టెంబ‌ర్ 23 నుంచి ద‌స‌రా బాక్సాఫీస్ స‌మ‌రం మొద‌లైన‌ట్టుగా తెలుస్తోంది. ఈ సీజ‌న్ లో సెప్టెంబ‌ర్ 23 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు మొత్తం 10 సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

డ‌బ్బింగ్ సినిమాల‌తో పాటు తెలుగు సినిమాలు కూడా ఈ రేసులో వున్నాయి. ఇందులో చిన్న హీరోల సినిమాల‌తో పాటు భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమాలు కూడా వున్నాయి. మొత్తం ప‌ది చిన్న సినిమాల నుంచి భారీ బ‌డ్జెట్ సినిమాలు ఈ ద‌స‌రా సీజ‌న్ కు ప్రేక్ష‌కుల‌ని ఆల‌రించ‌బోతున్నాయి. రెండు వారాల ముందే సినిమాల సంద‌డి మొద‌ల‌వుతోంది. 23న శ్రీ‌విష్ణు ప్రెస్టీజియ‌స్ గా భావిస్తున్న `అల్లూరి` రిలీజ్ అవుతోంది. అల్లూరి స్ఫూర్తితో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌గా ఈ మూవీని రూపొందించారు. ట్రైల‌ర్ మాస్ అంశాల‌తో ఆక‌ట్టుకుంటోంది.

ఇక ఇదే రోజు నాగ‌శౌర్య న‌టించిన `కృష్ణ‌ వ్రింద విహారి` రాబోతోంది. స‌రైన హిట్ మూవీ కోసం గ‌త కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న నాగ‌శౌర్య ఈసారి రొమాంటిక్ ప్రేమ‌క‌థ‌ని న‌మ్ముకున్నాడు. దీని ప్ర‌మోష‌న్స్ కోసం పాద‌యాత్ర అంటూ పెద్ద హ‌డావిడే చేశాడు. దీంతో ఈ మూవీ కూడా వార్త‌ల్లో నిలుస్తోంది. రీసెంట్ గా కొరియ‌న్ మూవీ ఆధారంగా చేసిన `షాకిని డాకిని` నిరాశ‌ప‌ర‌చ‌డంతో వెంట‌నే ఇదే మేక‌ర్స్ కీర‌వాణి త‌న‌యుడితో `దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌` మూవీని దించేస్తున్నారు. ఇక ఇదే రోజు `అవ‌తార్‌`ని స్పెష‌ల్ గా రీ మాస్ట‌ర్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఇక 29 నుంచి డ‌బ్బింగ్ సినిమాల హంగామా మొద‌లు కాబోతోంది. రీసెంట్ గా `తిరు` మూవీతో వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ధ‌నుష్ `నేనే వ‌స్తున్నా` సినిమాతో రాబోతున్నాడు. సెల్వ‌రాఘ‌వ‌న్ చాలా రోజుల త‌రువాత డైరెక్ట్ చేసిన ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంద‌రిలోనూ ఆస‌క్తి మొద‌లైంది. అంతే కాకుండా ఇందులో ధ‌నుష్ హీరోగా, విల‌న్ గా ద్విపాత్రాభిన‌యం చేసిన సినిమా కావ‌డం, ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా వుండ‌టంతో ఆస‌క్తి మొద‌లైంది.

ఆ వెంట‌నే అంటే సెప్టెంబ‌ర్ 30న మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వ‌న్ 1` రిలీజ్ కాబోతోంది. త‌మిళంలో హ‌డావిడి చేస్తున్నా తెలుగులో మాత్రం ఈ మూవీకి పెద్ద‌గా బ‌జ్ లేదు. ఇక ఇదే డేట్ న బాలీవుడ్ రీమేక్ `విక్ర‌మ్ వేద‌` రిలీజ్ అవుతోంది. త‌మిళ మాతృక‌ని మించి రూపొందించ‌డం, హృతిక్ రోష‌న్ నట విశ్వ‌రూపం చూపించిన సినిమాగా టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌లో తేల‌డంతో ఈ మూవీ పై భారీ అంచ‌నాలున్నాయి.

ఈ సినిమాల త‌రువాత అక్టోబ‌ర్ 5న మెగాస్టార్ `గాడ్ ఫాద‌ర్‌`, నాగార్జున `ది ఘోస్ట్‌` రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో నాగ్ ` ది ఘోస్ట్‌` అన్ని విష‌యాల్లో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. మ‌ధ్య‌లో బెల్లంకొండ గ‌ణేష్ `స్వాతిముత్యం`తో వ‌స్తున్నాడు. ఈ ప‌ది సినిమాల్లో ఎన్ని హిట్ లు గా నిలుస్తాయో.. ఎన్ని ఫ్లాప్ గా మార‌తాయో వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.