Begin typing your search above and press return to search.
హీరోగా అతని కెరీర్ చివరి దశకు వచ్చేసిందా..?
By: Tupaki Desk | 16 Sep 2022 2:30 AM GMTటాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరోగా నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఆ హీరో. అయితే గత కొన్నేళ్లుగా వరుస ప్లాప్స్ లో డీలా పడిపోయిన అతను.. క్లిష్ట పరిస్థితుల్లో ఓ సాలిడ్ హిట్టు కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దీంతో హీరోకి ఎప్పటిలాగే వరుస ఆఫర్లు వచ్చాయి. ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఆ హీరో వరుస పెట్టి సినిమాలు సైన్ చేస్తూ వస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు.. ఒక సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇంకొకటి రెడీగా ఉంచుతున్నాడు. ఈ క్రమంలో అతను తన రెమ్యునరేషన్ ను కూడా పెంచినట్లు టాక్ ఉంది.
ఇటీవల ఆయనకు బ్యాక్ టూ బ్యాక్ రెండు డిజాస్టర్స్ పడ్డాయి. అయినప్పటికీ కొత్త సినిమాలకు కమిట్ అవ్వడానికి వెనకడుగుకు వేయలేదు. ఎడాపెడా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో ఉన్నన్ని ప్రాజెక్ట్స్ మరే ఇతర హీరో వద్ద లేవంటే అతిశయోక్తి లేదు.
అయితే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుండటంతో.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడేమో అనే కామెంట్స్ వచ్చాయి. అంతేకాదు హీరోగా కెరీర్ చివరి దశకు వచ్చిందని భావిస్తున్నాడేమో.. అందుకే కథలు - దర్శకుల గురించి పట్టించుకోకుండా సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నాడేమో అని అంటున్నారు.
బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడం.. జెట్ స్పీడ్ తో సినిమాలు పూర్తి చేయడం చూస్తుంటే.. అదే అనిపిస్తోందని మరికొందరు వాళ్ళని సమర్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే కథానాయకుడి పాత్రల్లో కాకుండా.. స్టోరీ బేస్డ్ చిత్రాల్లో నటించే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే సక్సెస్ కోసం ఆ ఏజ్ బార్ హీరో కుర్ర భామలను హీరోయిన్లుగా సెట్ చేసుకుంటున్నాడని.. యంగ్ గా కనిపించడానికి చాలా కష్టపడుతున్నాడని.. సినిమాల్లో ఫేస్ మీద ముడతలు కవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ బాగా కష్టపడాల్సి వస్తోందని సెటైర్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారు.
అందుకే ఇప్పటి నుంచైనా వయస్సుని దృష్టిలో పెట్టుకొని తన పక్కన సెట్ అయ్యే అమ్మాయిలను హీరోయిన్లను పెట్టుకోవాలని.. అతకు సూట్ అయ్యే కథలు - పాత్రలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.