Begin typing your search above and press return to search.
దీంతోనైనా కన్నడ పరిశ్రమలో మార్పు వచ్చేనా?
By: Tupaki Desk | 4 Feb 2019 7:05 AM GMTసౌత్ సినిమాల స్థాయిని తెలుగు, తమిళ, మలయాళ భాషల సినిమాలు బాలీవుడ్ రేంజ్ కు తీసుకు వెళ్లాయి. కలెక్షన్స్ పరంగా తెలుగు మరియు తమిళ చిత్రాలు బాలీవుడ్ చిత్రాలను ఢీ కొడుతున్నాయి. బాలీవుడ్ సినిమాల స్థాయిలో బడ్జెట్ తో తెలుగు, తమిళ చిత్రాలు రూపొందుతున్నాయి. కొన్ని సినిమాలు బాలీవుడ్ రేంజ్ ను కూడా దాటేశాయి. ఇప్పటి వరకు బాలీవుడ్ లో 300 కోట్ల బడ్జెట్ ను ఎక్కువగా అనుకుంటున్నారు. కాని తెలుగు మరియు తమిళంలో రెండు, మూడు వందల కోట్ల బడ్జెట్ లు చాలా కామన్. సౌత్ సినిమాలపై ఒకప్పుడు నార్త్ వారు ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు బుల్లి తెరపై వచ్చిన, వెండి తెరపై వచ్చినా కూడా సౌత్ సినిమాలకు నార్త్ వారు నీరాజనాలు పలుకుతున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీస్ అంటే తెలుగు, తమిళం, మలయాళం మాత్రమే కాదు కన్నడ సినీ పరిశ్రమ కూడా ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పితే కాని అందరికి గుర్తు రాదు. జాతీయ స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళ సినిమాల గురించి చర్చ జరుగుతుంది. కాని ఇన్నేళ కాలంలో ఎప్పుడు కూడా కన్నడ సినిమా గురించిన చర్చ జరగలేదు. ఎందుకంటే అక్కడ అన్ని కూడా ఔట్ డేటెడ్ సినిమాలు వస్తాయి. అక్కడ ప్రేక్షకులు కొత్త తరం సినిమాలను కోరుకుంటున్నా, మేకర్స్ మాత్రం తెలుగులో ఎప్పుడో దశాబ్దం క్రితం వచ్చిన కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు. అందుకే అక్కడ కన్నడ సినిమాలు కలెక్షన్స్ తక్కువగానే వస్తాయి.
తెలుగు సినిమా ఏదైనా అక్కడ భారీగా విడుదల అయితే మినిమంగా పది కోట్ల వసూళ్లు వస్తాయి. అదే కన్నడ సినిమా 20 కోట్లు వసూళ్లు సాధించింది అంటే గొప్ప విషయంగా చెప్పుకుంటారు. మొన్నటి వరకు ఇండస్ట్రీ హిట్ అంటే 70 కోట్లు సాధించిన 'రాజ కుమార' చిత్రమే. కేజీఎఫ్ చిత్రం రాకముందు వరకు కన్నడ సినిమాలు వంద కోట్ల మార్క్ ను చేరుకోలేక పోయాయి. 50 కోట్లు దాటింది అంటే మహా గొప్ప విషయం. అలాంటిది కేజీఎఫ్ ఏకంగా 250 కోట్లకు దగ్గరగా వచ్చింది.
కన్నడ సినీ పరిశ్రమ మొత్తం గర్వించే విధంగా కేజీఎఫ్ తెరకెక్కింది. సౌత్ సినీ పరిశ్రమలకు మాత్రమే పోటీగా కాకుండా బాలీవుడ్ మేకర్స్ కు సైతం పోటీ అన్నట్లుగా కేజీఎఫ్ మంచి కంటెంట్ తో రూపొందింది. మంచి కంటెంట్ తో, ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గుట్లుగా సినిమాలు తీస్తే తప్పకుండా వందల కోట్లు వస్తాయని కన్నడ సినీ పరిశ్రమకు కేజీఎఫ్ వసూళ్లు చేసి మరీ చూపించింది. మరి ఇప్పటికైనా కన్నడ మేకర్స్ కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తారా అనేది చూడాలి.
కలెక్షన్స్ పరంగా మలయాళ సినిమాలు తక్కువగా సాధిస్తాయి. ఎందుకంటే అక్కడ సినిమాకు మార్కెట్ తక్కువ. అయితే కన్నడ సినిమాల పరిస్థితి అలా కాదు. కర్ణాటకలో సినిమాలకు మంచి ఆధరణ ఉంటుంది. అందుకే మంచి సినిమాలు తీస్తే తెలుగు మరియు తమిళంలో నమోదు అయినట్లుగా సునాయాసంగా వందల కోట్లు నమోదు అవ్వడం ఖాయం. మరి ఇకపై అయినా కన్నడ మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.