Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి రెండో కూతురు రె`ఢీ` అంటోందా?

By:  Tupaki Desk   |   15 May 2020 4:45 AM GMT
శ్రీ‌దేవి రెండో కూతురు రె`ఢీ` అంటోందా?
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సురాళ్ల వెల్లువ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఖాన్ ల డాట‌ర్స్ తో పాటు క‌పూర్ వార‌సురాళ్లు స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు ముంబై సెల‌బ్రిటీ కిడ్స్ బాలీవుడ్ లో స‌త్తా చాటి స్టార్ డ‌మ్ అందిపుచ్చుకునేందుకు క‌ర‌ణ్ జోహార్ లాంటి ల‌క్కీ హ్యాండ్ ని ఆశ్ర‌యిస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర‌ణ్ అర‌డ‌జ‌ను మంది నాయిక‌ల్ని బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేశాడు. ఇటీవ‌ల శ్రీ‌దేవి కుమార్తె జాన్వీని.. చుంకీ పాండే కుమార్తె అన‌న్య‌ను కూడా అత‌డే ప‌రిచ‌యం చేశాడు. త‌దుప‌రి షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ని ప‌రిచ‌యం చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈలోగానే మ‌రో ముద్దుగుమ్మ క‌ర‌ణ్ సార‌థ్యంలో నాయిక‌గా ప‌రిచ‌యం అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఆమె ఎవ‌రు? అంటే.. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్. ఖుషీ ఇప్ప‌టికే విదేశాల్లో న‌ట‌శిక్ష‌ణ తీసుకుంది. అలాగే కెమెరా వెన‌క చాలా వ‌ర్క్ నేర్చుకుంది. డిప్ల‌మా స‌ర్టిఫికెట్ అందుకుంది. త‌దుప‌రి కెమెరా వెన‌క అనుభ‌వం ఘ‌డించి న‌టిగా తెర‌పైకొచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే తాను ఎక్క‌డ‌ అడుగుపెట్టినా అక్క‌డ‌ ప్రతిసారీ త‌న‌దైన‌ స్టైల్ స్టేట్మెంట్లతో యూత్ తలలు తిప్పి చూసేలా చేస్తోంది.

ఇప్ప‌టికే త‌న సోద‌రి జాన్వీ ధ‌డ‌క్ చిత్రంతో తెరంగేట్రం చేసి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఆ క్ర‌మంలోనే తాను కూడా న‌ట‌న‌లోకి అడుగుపెట్టి స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నించ‌నుంద‌ని తెలుస్తోంది. 19 వ‌య‌సు అందాల భామ‌ ఖుషీ ఇప్ప‌టికే ఫ్యాషనిస్టా‌గా అంద‌రికీ చేరువ‌వుతోంది. ఫ్యాష‌న్స్ ప‌రంగా షో స్టాప‌ర్ గా నిలుస్తోంది. ఇదంతా త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల్లో భాగ‌మేన‌ని విశ్లేషిస్తున్నారు.

తాజాగా ఖుషీ క‌పూర్ త‌న ఇన్ స్టా మాధ్య‌మం ద్వారా ప‌లు త్రోబ్యాక్(పాత‌) ఫోటోల్ని షేర్ చేసింది. మామ్ శ్రీదేవితో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటోలు.. జాన్వీతో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటోలు స‌హా త‌న చిన్న నాటి ఫోటోల్ని షేర్ చేసింది. ఇవ‌న్నీ అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో ఏడాది వ‌య‌సున్న చిన్నారిగా ఖుషీ ఎలా ఉందో క‌నిపిస్తోంది. అలాగే బాల్యంలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి ఫోటోలు ఎంతో క్యూట్ గా అల‌రిస్తున్నాయి. ఇక యుక్త‌వ‌య‌సులో ఖుషీ స్లిమ్ అయిన‌ప్ప‌టి ఫోటో వేడెక్కించేస్తోంది. అయితే స్కూల్ డేస్ లో ఖుషీ ఎంత బొద్దుగా ఉండేదో ఈ ఫోటోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది.