Begin typing your search above and press return to search.
మహేష్ క్లియర్ గానే ఉన్నాడట
By: Tupaki Desk | 19 Jan 2019 9:27 AM GMTప్రస్తుతం మహర్షి షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు తర్వాత సినిమాల గురించి క్లారిటీతోనే ఉన్నట్టున్నాడు. రంగస్థలం విడుదలైన కొన్ని నెలలకే అదే బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన ప్రిన్స్ ఇంకా కథను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇంతకు ముందు ఏదో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో లైన్ చెబితే మహేష్ కన్విన్స్ కాలేదని న్యూస్ వచ్చింది. ఆ తర్వాత సుక్కు రొమాంటిక్ డ్రామాను తీసుకుని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో మరో కథను వండే పనిలో ఉన్నాడు.
మహర్షి పూర్తయ్యే లోపు సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేయాలి. ఇంకా మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఆలోపు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే అర్జున్ రెడ్డి టైంలోనే సందీప్ రెడ్డి వంగా పనితనానికి ఫిదా అయిన మహేష్ అతనితో చేసేందుకు ముందు నుంచి ఆసక్తి చూపుతున్నాడు. అయితే సరైన స్క్రిప్ట్ సెట్ కాక గ్యాప్ తీసుకుని సందీప్ అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ కోసం ముంబై వెళ్ళిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ ప్లస్ ప్రమోషన్ మొత్తం చూసుకుని రిటర్న్ వచ్చే లోపు మే దాటేస్తుంది.
సుకుమార్ ది మేలో మొదలుపెట్టినా డిసెంబర్ లోపు పూర్తి చేయొచ్చు. ఆ తర్వాత సందీప్ లైన్ లోకి వస్తాడు. క్రైమ్ థ్రిల్లర్ ని సందీప్ ఎంచుకున్నట్టు తెలిసింది. మహేష్ ఇంతకు ముందు సైకో థ్రిల్లర్ చేసాడు కాని అవుట్ అండ్ అవుట్ క్రైమ్ మీద చేయలేదు. సో ఇదీ వెరైటీ బ్యాక్ డ్రాప్ అవుతుంది. వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ మరో రెండు నెలల్లో వచ్చేస్తుంది