Begin typing your search above and press return to search.

ఈ ఎనర్జీ సరిపోతుందా అఖిల్ ?

By:  Tupaki Desk   |   3 Jan 2019 5:52 AM GMT
ఈ ఎనర్జీ సరిపోతుందా అఖిల్ ?
X
నిన్న విడుదలైన మిస్టర్ మజ్ను టీజర్ అభిమానులకు బాగానే కనెక్ట్ అయ్యింది. కానీ ఆశించినంత కొత్తదనం ఏమి లేదనే అభిప్రాయం సాధారణ ప్రేక్షకుల్లో వ్యక్తమయ్యింది. నిజానికి ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లయినా కేవలం రెండే సినిమాలతో కనీసం యావరేజ్ సాధించలేదన్న నిరాశ అభిమానుల్లో అయితే ఉంది. మిస్టర్ మజ్నుతో సాలిడ్ హిట్ కొట్టి వైల్డ్ కార్డు ఎంట్రీలాగా స్టార్ రేస్ లో ముందుకు వచ్చేయాలని కోరుతున్నారు ఫాన్స్. అయితే దీనికి సక్సెస్ చాలా కీలకం. ఒక ప్లే బాయ్ కథతో దర్శకుడు వెంకీ అట్లూరి కొత్త ప్రయోగం ఏది చేసినట్టు కనిపించడం లేదు. పైగా ఇది బాలీవుడ్ మూవీ బచ్నా ఏ హసీనో పోలికల్లో ఉందన్న కామెంట్ కూడా బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మిస్టర్ మజ్ను ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అమ్మాయిల వెనక పడే ఒక హీరో హీరోయిన్ ని చూడగానే నిజమైన ప్రేమలో పడటం తనను మెప్పించేందుకు పాట్లు పడటం ఇదంతా గతంలో చూసిన వ్యవహారమే. అందువల్లే మిస్టర్ మజ్ను టీజర్ ఆశించిన బజ్ తెచ్చుకోలేదనే చెప్పాలి. ట్రైలర్ కోసం ఏదైనా దాచారేమో చూడాలి. అఖిల్ వయసుకు తగ్గట్టు ఇలాంటి పాత్రలే సూటవుతాయి కానీ ఎంత ప్రేమ కథ అయినా బలమైన కంటెంట్ చాలా అవసరం.

పైగా సవ్యసాచితో లాంచ్ అయిన నిధి అగర్వాల్ లో ఇందులో కూడా ఏదో మేజిక్ చేసేంత గ్లామర్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో అఖిల్ మీదే అధిక భారం ఉండబోతోంది. జనవరి 25న విడుదల కానున్న మిస్టర్ మజ్ను అక్కినేని ఫామిలీకి మరో కోణంలో కూడా చాలా అవసరం. కుటుంబ హీరోలకు గత ఏడాదికి పైగా సక్సెస్ అందని ద్రాక్షగా మారుతోంది. సో దీంతో అయినా విజయాల ఖాతా ఓపెన్ అవ్వాలని ఎదురు చూస్తున్నారు. మరి అఖిల్ వీటిని ఎంత వరకు నెరవేరుస్తాడో వేచి చూడాలి.