Begin typing your search above and press return to search.
`యాత్ర`కు పోటీ .. ఇదేం కామెడీ?
By: Tupaki Desk | 6 Feb 2019 4:54 AM GMTమాజీ ముఖ్యమంత్రి డా.వైయస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని `యాత్ర` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాత్ర ఘట్టాలతో పాటు, ప్రజల కష్టాల్ని, హ్యూమన్ ఎమోషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించామని దర్శకుడు మహి.వి.రాఘవ్ తెలిపారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్సార్ పాత్రలో నటించారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వైయస్సార్ సినిమాకి పోటీగా వేరొక సినిమాని ప్రారంభించడంపై అప్పట్లోనే ఆసక్తికర చర్చ సాగింది.
సీనియర్ దర్శకుడు దేవీ ప్రసాద్, వాయు తనయ్, శశి ముఖ్య పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో `నేనే ముఖ్యమంత్రి` అనే చిత్రం తెరకెక్కింది. వైష్ణవి ఫిలింస్, ఆలూరి క్రియేషన్స్ పతాకాలపై అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తిగా వైయస్ జగన్ కి వ్యతిరేకంగా ఉంటుందంటూ ఒకటే ప్రచారం సాగుతోంది. అయితే నిర్మాతలు మాత్రం ..ఈ చిత్రం ద్వారా సమకాలీన రాజకీయ అంశాల గురించి చర్చించాం. అన్నివర్గాలకు నచ్చే అంశాలతోపాటు అందర్నీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయని చెబుతున్నారు. నేటి సమాజిక, రాజకీయ పరిస్థితులకు అద్దంపడుతూ ఈ చిత్రాన్ని నిర్మించామని అంటున్నారు. ఈనెల 8న సినిమాను రిలీజవుతోంది. అయితే ఈ సినిమా యాత్రకు పోటీనా?
అసలు ఏమాత్రం బజ్ లేని.. ఈ సినిమా మమ్ముట్టి సినిమాకి పోటీనా? అంటూ ఫిలింనగర్ లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక కొత్త హీరోతో సినిమా తీయడమే సాహసం అనుకుంటే అది కూడా ప్రజల్లో అసాధారణ పాపులారిటీ ఉన్న ఓ నాయకుడిపై తీసిన `యాత్ర` కు పోటీ అంటూ కామెడీలు చేయడం చర్చకొచ్చింది. జగన్ పై సెటైర్ కోసం సినిమా తీశారన్న ప్రచారం చూస్తుంటే... ఛీప్ పబ్లిసిటీ కాదా? అంటూ ముచ్చటించుకుంటున్నారు. అంతగా క్రేజు లేని నేనే ముఖ్యమంత్రి.. ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందా? అన్న ముచ్చటా సాగుతోంది.