Begin typing your search above and press return to search.
ట్రైలర్ ఏది అల్లుళ్ళూ ?
By: Tupaki Desk | 1 Jan 2019 8:25 AM GMTకేవలం పదకొండు రోజులు మాత్రమే టైం ఉంది ఎఫ్2 రిలీజ్ కు. ఇప్పటిదాకా ట్రైలర్ రాలేదు. మొన్న వైజాగ్ బీచ్ ఒడ్డున ఘనంగా ఆడియో రిలీజ్ చేసారు కానీ దీని ఊసు మాత్రం లేదు. అసలు వస్తుందా రాదా అనే అనుమానాలు లేకపోలేదు. కామెడీ ఎంటర్ టైనర్ గా కాస్త బజ్ ఉన్న ఈ మూవీకి హైప్ పెరగాలంటే ట్రైలర్ ఉండాల్సిందే. అయితే దాని సూచనలు మాత్రం కనిపించడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వెర్షన్ రెడీ అయినప్పటికీ అది అంత సంతృప్తికరంగా లేకపోవడంతో పక్కన పెట్టారట. అంతే కాదు కథలోని కీలకమైన పాయింట్ రివీల్ చేసేలా అదుండటంతో రిస్క్ అని భావించి వేరే ట్రైలర్ కట్ కోసం ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతోందని సమాచారం.
అసలే దిల్ రాజు ఈ మధ్య టైం కలిసి రాక బాగా ఇబ్బంది పడుతున్నారు. తన బ్యానర్ రేంజ్ కు తగ్గట్టు గత ఏడాది ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. వేరే సినిమాల డిస్ట్రిబ్యూషన్లు కాపాడుతున్నాయి కానీ కేవలం నిర్మాణంలో మాత్రమే ఉంటే ఈపాటికే కష్టమనిపించేది. ఎఫ్2కు ఎంత బజ్ ఉన్నా సంక్రాంతి రేస్ ని దాటడం అంత ఈజీ కాదు. ఒక రోజు ముందు వచ్చే వినయ విధేయ రామ మీద మెగా ఫాన్స్ మాత్రమే కాదు మాస్ ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు. వాటిలో సగం అందుకున్నా చాలు రికార్డుల మోత ఖాయం. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకున్న ఎఫ్2 దానికి ధీటుగా పోటీ ఇవ్వాలంటే బ్రాండ్ ఒక్కటే సరిపోదు.
వెంకటేష్ ఎంత సీనియర్ అయినా ఇతర హీరోల ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడు లేదు. వరుణ్ తేజ్ అప్ కమింగ్ క్యాటగిరీలోనే చూడాలి. కేవలం ఇమేజ్ ల ప్రాతిపదికగా ఆడే పనైతే అంతరిక్షంకు నష్టాలు వచ్చి ఉండేవి కాదు. సో ఎఫ్2 ఇలా సైలెంట్ గా ఉండటం వల్ల కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ట్రైలర్ విషయంలో మరి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్. తొడలుళ్లుగా వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ మూవీకి దర్శకుడు అనిల్ రావిపూడి