Begin typing your search above and press return to search.
మహానటికి, ఎన్టీఆర్ కు పోలికపెట్టొచ్చా..?
By: Tupaki Desk | 26 Dec 2018 1:30 AM GMTప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ దీన్ని మహానటితో పోలుస్తున్నారు. మహానటిలా ఈ సినిమా కూడా అందర్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. మహానటికి ఉన్న ప్లస్.. ఇక్కడ ఎన్టీఆర్ బయోపిక్ కి మైనస్ కాబోతుంది.
మహానటి సావిత్రి జీవితం గురించి ఎక్కువమందికి చాలా తక్కువు తెలుసు. ఆమె స్టార్ అని.. సరైన ప్లాన్నింగ్ లేకుండా జీవితంలో అన్నీ కోల్పోయిందని మాత్రమే తెలుసు. కానీ అలా ఎందుకు జరిగింది, ఆమె జీవితంలో ఉన్న విశేషాలు ఏంటి అని చాలామందికి తెలీదు. అవన్నీ తన సినిమాలో పెట్టాడు కాబట్టే మహానటి విషయంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. హిట్ కొట్టాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కు వచ్చేసరికి పూర్తి రివర్స్. ఎన్టీఆర్ పుట్టిన దగ్గరనుంచి మరణించేంత వరకు ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఇందులో కొత్తగా చూపించాల్సింది, జతచేయాల్సింది ఏం లేదు.
అయితే.. ఇక్కడ ఎన్టీఆర్ పాత్రను బాలయ్యే చేయడమే హైలెట్. బాలయ్య ఎలా చేసి ఉంటాడు, పెద్దాయన పాత్రలో ఎలా ఒదిగిపోయింటాడు, ఏఎన్నార్- శ్రీదేవి- సావిత్రి పాత్రలు ఎలా వచ్చి ఉంటాయి.. ఆనే ఆసక్తి అందరిలో ఎక్కువుగా ఉంటుంది. సో.. ఎంత ఊహించుకుని వెళ్లినా.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మనకు కచ్చితంగా నచ్చుతుంది. అందుకే.. మహానటికి- ఎన్టీఆర్ బయోపిక్ కు పోలిక పెట్టి చూడడం అర్థరహితం.