Begin typing your search above and press return to search.
నైజాంలో ఎన్టీఆర్ కు స్ట్రోక్ తప్పదా ?
By: Tupaki Desk | 14 Dec 2018 6:19 AM GMTతెలంగాణా ఎన్నికలు సినిమాల మీద చూపించే ప్రభావం గురించి గతంలో వ్యక్తమైన అనుమానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహాకూటమిగా కాంగ్రెస్ టిడిపి ఒకే తాటి పైకి వచ్చి ప్రచారంలో కెసిఆర్ ప్రభుత్వం మీద ముప్పేట దాడి చేసిన సంగతి ఇంకా ఫ్రెష్ గానే ఉంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కాస్త సినిమాటిక్ గా డైలాగులు చెప్పి తెరాస మీద తీవ్రమైన విమర్శలే చేసాడు. బుల్ బుల్ అంటూ చేసిన కామెడీ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ దాని కన్నా ఎక్కువగా బాలయ్య చేసిన ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు జనవరి రాబోయే ఎన్టీఆర్ సినిమా కు నైజాం లో ఇబ్బందులు తీసుకురావోచ్చనే విశ్లేషణలు మొదలయ్యాయి.
బిజినెస్ ప్రకారం బాలయ్య సినిమాల్లో హయ్యెస్ట్ గా చెప్పబడుతున్న ఎన్టీఆర్ ఓపెనింగ్స్ విషయంలో గట్టిగా రాబట్టుకోవాలి అంటే స్పెషల్ షోలు చాలా అవసరం. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో. కాని వియ్యంకుడి కోసం ప్రచారంలోకి దిగి నానా మాటలు అనేసిన బాలయ్య సినిమాకు ఇక పై ఎలాంటి ప్రత్యేక వెసులుబాటులో ఉండబోవు అనేది కొందరి మాట. నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇదే తెరాస గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి కి పన్ను రాయితీ ఇచ్చింది. స్పెషల్ షోలు కూడా పడ్డాయి. కాని ఎన్టీఆర్ కు అదే రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా కాంగ్రెస్ తో అంతకాగడం మీద కేసిఆర్ కు టిడిపి మీద పీకల వరకు ఉంది. ఈ నేపధ్యంలో పక్క రాష్ట్రం టిడిపి ఎమెల్యే నటించిన సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం జరగని పని అని విశ్లేషకుల వాదన. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇందులో లాజిక్ ఉంది. సో ఎన్టీఆర్ కు నైజాం లో తెలంగాణా ఫలితాలు ఈ రకంగా ప్రభావం చూపబోతున్నయన్న మాట.