Begin typing your search above and press return to search.

రాజమౌళి కోసం ఎన్టీఆర్ క్వింటాల్

By:  Tupaki Desk   |   4 Dec 2018 8:00 AM GMT
రాజమౌళి కోసం ఎన్టీఆర్ క్వింటాల్
X
ఆర్ఆర్ఆర్ తాలూకు అఫీషియల్ అప్ డేట్స్ రావడం లేదు కానీ అభిమానుల్లో మాత్రం దాని మీద ఎడతెగని ఆసక్తి నెలకొని ఉంది. ఇద్దరు హీరోల గెటప్స్ ఎలా ఉంటాయి వాళ్ళ నేపథ్యం ఏంటి అనే దాని గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి. స్వాతంత్రం రాకముందు బ్యాక్ డ్రాప్ అనే విషయం మాత్రం దాదాపు స్పష్టమైనట్టే.ఇకపోతే మరొక ఆసక్తిరమైన అప్ డేట్ చర్చకు దారి తీస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తన పాత్ర కోసం ఏకంగా క్వింటాల్ అంటే వంద కిలోలకు పైగా బరువు పెరగబోతున్నాడనే టాక్ హాట్ టాపిక్ గా మారింది.

దానికి తగ్గట్టే షూటింగ్ ఓపెనింగ్ రోజుతో పాటు మొన్న బయటికి వచ్చిన లీక్డ్ ఫోటోలో సైతం ఎన్టీఆర్ ఒళ్ళు చేసినట్టు కనిపించడం ఈ అనుమానాలకు దారి తీస్తోంది. అరవింద సమేత వీర రాఘవ కోసం ఒళ్ళు హూనం చేసుకుని విదేశీ ట్రైనర్ సహాయంతో ఆరు పలకల దేహాన్ని సాధించిన తారక్ ఇంత తక్కువ గ్యాప్ లోనే అంత బరువు అంటే సాహసమే.

అసలు బ్యాక్ డ్రాప్ గురించే సస్పెన్స్ అంతుచిక్కక ఫ్యాన్స్ సతమతమవుతుంటే ఇప్పుడీ వంద కిలోల న్యూస్ షాక్ ఇచ్చేదే. అయినా రాజమౌళి ఏదైనా సమయం వచ్చినప్పుడే చెప్తాడు కాబట్టి వెయిట్ చేయడం తప్ప ఎవరు ఏం చేయలేని పరిస్థితి. వినయ విధేయ రామ చివరి పాట కోసం కొంత బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్ డిసెంబర్ 25న జరిగే ఆడియో రిలీజ్ లో పాల్గొనాల్సి ఉంది. తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం తాను కూడా ఏదైనా స్పెషల్ లుక్ లోకి మారాల్సి ఉంటుందేమో జక్కన్న చరణ్ లకు మాత్రమే తెలుసు. మొత్తానికి విడుదలకు చాలా టైం ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ ఇప్పటి నుంచే హాట్ డిస్కషన్స్ లో భాగంగా మారిపోయింది..