Begin typing your search above and press return to search.
శర్వా మూవీ ఫ్లాప్ మూవీకి కాపీనా?
By: Tupaki Desk | 15 Dec 2018 5:30 PM GMT‘శతమానం భవతి’ చిత్రం తర్వాత శర్వానంద్ సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజా గా హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన ‘పడి పడి లేచే మనసు’ మూవీ తో మరోసారి తన అదృష్టం ను పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమా పై అందరికి ఆసక్తిగా ఉంది. ‘లై’ వంటి ఫ్లాప్ తర్వాత హను రాఘవపూడి కసి తో ఈ సినిమాను తీసినట్లుగా అనుకుంటున్నారు. సినిమా విడుదలకు సిద్దం అయిన సమయంలో ఈ కథ కాపీ అంటూ వార్తలు వస్తున్నాయి.
యాక్సిడెంట్ లో గత మర్చి పోయే హీరోయిన్ వల్ల ఆమె ప్రియుడు పడే బాధ ను ఈ చిత్రం లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. గతం లో సేమ్ టు సేమ్ ఇదే స్టోరీ లైన్ తో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘తేజ్ ఐలవ్ యూ’ అంటూ కరుణాకరన్ తెరకెక్కించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టడం లో ఆ మూవీ విఫలం అయ్యింది. ఇప్పుడు అదే స్టోరీ లైన్ తో ‘పడి పడి లేచే మనసు’ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం పై ఎలాంటి ప్రభావం పడుతుందా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు.
తెలుగులో సాయి పల్లవి ఇప్పటి వరకు నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ చిత్రం కూడా సెంటిమెంట్ తో తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మంచి కథ కోసం చాలా కాలం వెయిట్ చేసిన సాయి పల్లవి ఈ చిత్రంకు ఓకే చెప్పిందంటే ఖచ్చితంగా ఇది మంచి కథ అయ్యి ఉంటుందని కొందరు విశ్వసిస్తున్నారు. విభిన్న ప్రేమ కథా చిత్రాలను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్న హను రాఘవపూడి ఈ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కేనా? శర్వానంద్ కు సక్సెస్ దక్కేనా? సాయి పల్లవి సక్సెస్ యాత్ర కొనసాగేనా అనేది చూడాలి.