Begin typing your search above and press return to search.

పెళ్ళంటే ప్రభాస్ కు బద్దకమట

By:  Tupaki Desk   |   24 Dec 2018 6:54 AM GMT
పెళ్ళంటే ప్రభాస్ కు బద్దకమట
X
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొదటి ప్లేస్ లో ఉన్న డార్లింగ్ పెళ్ళెప్పుడన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పలుమార్లు ఇంటర్వ్యూలలో గుచ్చి గుచ్చి అడుగుతున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వస్తున్న రెబెల్ స్టార్ కాఫీ విత్ కరణ్ సీజన్ 6లో కూడా దొరికిపోయాడు. ఇరుకున పెట్టే ప్రశ్నలతో సెలెబ్రిటీల నుంచి ఏదో ఒక వివాదం రాజేసే ప్రయత్నం చేసే దర్శక నిర్మాత కం యాంకర్ కరణ్ జోహార్ ఇందులో ప్రభాస్ పెళ్లిని టార్గెట్ చేసాడు. అయితే దీనికి వెరైటీగా రాజమౌళి బదులు చెప్పే ప్రయత్నం చేయడం విశేషం.

ఆయన చెప్పిన ప్రకారం ప్రభాస్ కు మహా బద్దకమట. అందుకే పనులో ఒత్తిడిలో పెళ్లి చేసుకోవాలి అనే మాట మర్చిపోతున్నాడని చెప్పుకొచ్చాడు. దానికి బాహుబలి ముసిముసి నవ్వులు నవ్వాడే తప్ప ఖండించే ప్రయత్నం చేయలేదు. దీని పుణ్యమా అని ప్రభాస్ పెళ్లి టాపిక్ మరోసారి తెరమీదకు వచ్చింది. అయినా కూడా ప్రభాస్ ఓపెన్ కావడం లేదు . ఒకవేళ సాహో పూర్తయ్యాక చేసుకుంటాడా అంటే ఆ లోపు మరో భారీ సినిమా ఏదో ఒప్పుకుంటాడు మళ్ళి పెండింగ్ పడిపోతుంది.

బాహుబలి సమయంలో ఇదే సాకుగా చెప్పి తప్పించుకున్న ప్రభాస్ ఆఖరికి పెదనాన్న కృష్ణంరాజుకు సైతం పజిల్ లా మారిపోయాడు., అన్నట్టు దీంట్లో అనుష్క ప్రస్తావన కూడా వచ్చిందండోయ్. అయితే స్వీటీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అంతకు మించి ఇద్దరి మధ్యా ఏం లేదని చెప్పిన ప్రభాస్ చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చినట్టు కనిపించాడు కాని అసలు నిజాలు మాత్రం కరణ్ జోహార్ లాంటి కరడు కట్టిన యాంకర్ కూడా చెప్పించలేకపోయాడు