Begin typing your search above and press return to search.
ఆ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ పై చేయిచేసుకున్నాడా?
By: Tupaki Desk | 14 Dec 2018 6:06 AM GMTఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ ఉంది.. "ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు సంథింగ్". అంటే ఏ సమస్య అయినా అనలైజ్ చేసుకుంటూ పోతే మూల కారణం మాత్రం ఒకటే ఉంటుంది. ఆ 'సంథింగ్' దాదాపుగా డబ్బే అయి ఉంటుంది. మరి సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ అంతా డబ్బుచుట్టూనే తిరుగుతుంది. అందుకు ఎవరినీ మనం తప్పు పట్టలేం.. విజయాల శాతం అతితక్కువగా ఉన్న ఇండస్ట్రీ కాబట్టి నష్టాలు సాధారణమే.. మనీ విషయంలో గొడవలు జరుగడం కూడా మామూలే. కానీ అన్నీ బయటకు రావు. కానీ ఈమధ్య ఒక నిర్మాత డిస్ట్రిబ్యూటర్ మీద చేయి చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఆర్థకపరమైన లావాదేవీల గురించి చర్చించి సమస్యను పరిష్కరించుకునేందుకు ఈమధ్య ఒక డిస్ట్రిబ్యూటర్ పాపులర్ నిర్మాతను కలిశాడట. వారిమధ్య చర్చలు జరుగుతున్న సమయంలో మాటా మాట పెరగడంతో కోపం పట్టలేకపోయిన నిర్మాత ఆ డిస్ట్రిబ్యూటర్ పై చేయిచేసుకున్నాడట. ఈ విషయం ఫిలిం నగర్లో ఓ హాట్ టాపిక్ అయింది. కానీ ఆ నిర్మాత మాత్రం అలాంటిదేమీ జరగలేదని.. గిట్టనివారు అలా చెడు గా ప్రచారం చేస్తున్నారని అంటున్నాడట. ఆ డిస్ట్రిబ్యూటర్ తో వాదన జరిగిన విషయం నిజమే గానీ కొట్టడం మాత్రం నిజం కాదని అంటున్నాడట.
మరి నిర్మాత చెప్పినట్టు చిన్న వాదన మాత్రమే అయితే ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారో ఆ గిట్టని వాళ్ళు. అయిన ఇలాంటి వార్తల్లో ఏవి నిజాలో ఏవి అబద్ధాలో తెలుసుకోవడం చాలా కష్టం. జస్ట్ విని ఊరుకోవాలంతే.