Begin typing your search above and press return to search.
క్రిటిక్స్ పై అస్సలు తగ్గవేం జక్కన్నా?
By: Tupaki Desk | 17 March 2019 7:40 AM GMTRRR సస్పెన్స్ వీడింది. కథ, క్యారెక్టర్లు సహా రిలీజ్ తేదీపై మొత్తం గుట్టు విప్పేసి సైలెంట్ గా తన పనిలో తాను పడిపోయాడు రాజమౌళి. ఏడాదిన్నర కాలంగా గాసిప్ రాయుళ్ల గాసిప్పులన్నీ తుస్సుమనేలా .. బిగ్ సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చాడు. ఎన్టీఆర్, చరణ్ పాత్రల్లో సస్పెన్స్ లేకుండా ఓపెన్ చేసేశాడు. ఆల్మోస్ట్ సినిమా కథ ఇదీ అని రివీల్ చేసేశాడు. చివరికి అజయ్ దేవగణ్ అసలు విలన్ గానే నటించడం లేదని ఓపెన్ అయిపోయాడు. కొమరం భీమ్ (ఎన్టీఆర్) - అల్లూరి సీతారామరాజు (చరణ్) - భగత్ సింగ్ (దేవగణ్ ఇదే నట) రోల్స్ గురించి పూర్తిగా క్లారిటీని ఇచ్చేశాడు. అయితే గుప్పిట్లో దాచాలని చూసే దర్శకధీరుడు ఎందుకింతగా ఓపెనయ్యాడు? అంటే దాని వెనక గుట్టు ఒకటి లీకైంది.
ఎస్.ఎస్.రాజమౌళి తనకు తానుగానే ఈ మొత్తం గుట్టు రివీల్ చేయడం వెనక అసలు లాజిక్ ఏంటి? అని వెతికితే ఓ ఆసక్తికర సంగతి అర్థమవుతోంది. ఇన్నాళ్లు రాజమౌళి సినిమా అంటే క్రిటిక్స్ కాపీ క్యాట్ కథ అనో, లేక ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టేశాడనో రచ్చ చేసేవారు. జాతీయ స్థాయిలో అది డిబేట్ అయ్యేది. అందుకే ఆ ముప్పు తిప్పలేవీ ఈసారి తనకు లేకుండా చూసుకునేందుకు చాలానే జాగ్రత్త పడ్డారు క్లెవర్ మ్యాన్. హాలీవుడ్ క్లాసిక్ `మోటార్ సైకిల్ డైరీస్` చూసి స్ఫూర్తి పొంది.. అదే లైన్ తీసుకుని స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న తెలుగు వీరుల్ని ఫిక్షనైజ్ చేసి చూపిస్తున్నానని కథ విషయంలోనూ కాపీ క్యాట్ అన్న రూమర్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రతిసారీ విమర్శించినట్టే ఆర్.ఆర్.ఆర్ విషయంఓ ఏదో ఒక పేరుతో క్రిటిక్స్ మరోసారి విమర్శిస్తే అది జాతీయ స్థాయిలో డిబేట్ అవుతుందన్న భయం కూడా కనిపించింది. ఆర్.ఆర్.ఆర్ తొలి ఈవెంట్ లో మరీ అంతగా అన్ని వివరాల్ని పూస గుచ్చేయడం వెనక అన్ని భయాలు కనిపించాయి.
`ఈగ` రిలీజైన అన్ని చోట్లా బంపర్ హిట్ కొట్టింది. కానీ అదో బొద్దింక సినిమా .. `కాక్రోచ్` అనే హాలీవుడ్ సినిమాకి కాపీ అంటూ తెలుగు మీడియా నానా రచ్చ చేసింది. అలాగే బాహుబలి చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రిలీజై ఏకంగా 2500 కోట్లు కొల్లగొట్టింది. ఇండియా నంబర్ 1 వసూళ్ల సినిమా(దంగల్ ఇండియా నం.2) గా నిలిచింది. అయినా ఆ చిత్రం పోస్టర్ల విషయంలో కాపీ చేశారని వివాదం వచ్చింది. ఇలా ఏదో ఒక వివాదం జక్కన్నను విడిచిపెట్టలేదు. దీంతో ఆర్.ఆర్.ఆర్ విషయంలో రాజమౌళి ఎంతో జాగ్రత్త పడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాపై 300-400 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. జాతీయ స్థాయిలో దీనిపై మినిమంగా 500 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తోంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. ఇక మీ సినిమాలపై విమర్శలు ఎందుకు? అని ప్రశ్నిస్తే.. రాజమౌళి స్పందన కూడా అంతే వ్యంగ్యంగానూ వినిపించింది ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో. విమర్శలు అనేవి `పార్ట్ & పార్సిల్`. అవి వస్తుంటాయి.. వెళుతుంటాయి! అని కొట్టి పారేశారే కానీ, తాను ఎప్పుడూ కాపీ కొట్టానన్న ఊహ కూడా రానివ్వలేదు. విమర్శకుల విషయంలో జక్కన్న ఏమాత్రం తగ్గలేదని అతడి సమాధానం స్పష్టంగా చెప్పింది. విమర్శించేవాళ్లు విమర్శిస్తుంటారు. అవి ఈ రోజుల్లో ప్రతి సినిమాకి కామన్ అయిపోయాయి. అలాంటప్పుడు అస్సలు పట్టించుకోవడం ఎందుకు? అన్నట్టే వ్యవహరించారు. మొత్తానికి టాలీవుడ్ క్రిటిక్స్ పై జక్కన్న `పాత బెంగ.. పాత కక్ష` అలానే మిగిలి ఉందని అర్థం చేసుకోవచ్చు!!!