Begin typing your search above and press return to search.
నచ్చని సినిమాలకు రాజమౌళి ట్వీట్లా?
By: Tupaki Desk | 24 Dec 2018 2:10 PM GMTదర్శక ధీరుడు ట్విట్టర్లో అప్పుడప్పుడూ వేరే సినిమాల గురించి ట్వీట్లు చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. తనకు నచ్చిన సినిమా ఏదైనా వస్తే రిలీజ్ రోజు ప్రసాద్ ఐమాక్స్ లో 8.45 షో చూసి వచ్చి వెంటనే ట్వీట్ పెడుతుంటాడు జక్కన్న. అలాగే తన మిత్రులు.. సన్నిహితులు ఎవరైనా సినిమా తీస్తే దానికి సంబంధించిన ఏదైనా వేడుకకు హాజరై తన వంతుగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ముఖ్యంగా తన ఆప్తమిత్రుడైన సాయి కొర్రపాటికి ఈ రకమైన సపోర్ట్ బాగా ఇస్తుంటాడు రాజమౌళి. ఐతే కొన్నిసార్లు రాజమౌళి ఇచ్చే రివ్యూలు.. చేసే వ్యాఖ్యలు తేడా కొట్టేస్తుంటాయి. ఆయన ఎండోర్స్ చేసిన సినిమాలు కొన్ని దారుణమైన ఫలితాలు అందుకుంటుంటాయి. దీని వల్ల ఈ మధ్య రాజమౌళి క్రెడిబిలిటీ బాగా దెబ్బ తినేసింది.
ఈ విషయాన్ని గుర్తించే ఏమో.. ‘కాఫీ విత్ కరణ్’ సినిమాలో రాజమౌళి వాస్తవం ఒప్పేసుకున్నాడు. మీకు నచ్చని సినిమాల గురించి ఎప్పుడైనా పాజిటివ్ ట్వీట్లు వేశారా అని అడిగితే.. అవునని జక్కన్న సమాధానం ఇవ్వడం గమనార్హం. సమాధానం దాటవేయకుండా నిజాయితీగా జవాబు చెప్పడం అభినందనీయమే కానీ.. నచ్చని సినిమాల్ని కూడా బాగున్నాయంటూ ట్వీట్లు వేసి జనాల్ని ప్రభావితం చేయాలని చూడటం మోసమే కదా? ఆయన చాలా పాజిటివ్ గా మాట్లాడిన సినిమాల్లో ఎక్కువగా సాయి కొర్రపాటివే ఉండటం విశేషం. ఆయన నిర్మించిన ‘పటేల్ సార్’.. ‘యుద్ధం శరణం’ లాంటి సినిమాల గురించి జక్కన్న గొప్పగా మాట్లాడాడు. కానీ అవి దారుణ ఫలితాన్నందుకున్నాయి. నందమూరి బాలకృష్ణ సినిమా ‘పైసా వసూల్’ గురించి అప్పట్లో జక్కన్న చేసిన పాజిటివ్ కామెంట్స్ కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.