Begin typing your search above and press return to search.

ఇది ఎలా సాధ్యం వర్మా

By:  Tupaki Desk   |   10 April 2019 7:32 AM GMT
ఇది ఎలా సాధ్యం వర్మా
X
వర్మ తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో కానీ అతని చర్యలు మాత్రం ఊహాతీతంగా ఉంటాయి. నిన్న ఉన్నట్టుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ విడుదల అంటూ ప్రకటన ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. నిజానికి దీనికి సంబంధించి ఇంకా కోర్ట్ నుంచి క్లియరెన్స్ రాలేదు. తీర్పు పెండింగ్ లో ఉంది. రేపు ఇది హియరింగ్ కి వచ్చినప్పుడు మేము తీర్పు అనుకూలంగా ఇస్తామని ముందే ఊహించుకుని ప్రకటనలు ఇచ్చారా అని నిలదీస్తే వెంటనే సమాధానం చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు.

సరే వర్మ చెప్పింది కాసేపు నిజమే అనుకుందాం. ఈ వారమే విడుదల అంటే రేపు పోలింగ్ కాబట్టి దాన్ని మినహాయిస్తే అటు పై మూడు రోజులు మాత్రమే ఉంటుంది. శుక్రవారం చిత్రలహరి లూసిఫర్ మాత్రమే షెడ్యూల్ అయ్యాయి. బయ్యర్లు కూడా వీటికి అనుగుణంగా థియేటర్లు అలాట్ చేసుకుని రెడీగా ఉన్నారు. మరి లక్మిస్ ఎన్టీఆర్ ఎలా వస్తుంది

సో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో పోలింగ్ ఉందనగా వర్మ ఇలా ప్రకటన ఇవ్వడం కేవలం హైప్ కోసమే తప్ప మరొకటి కాదనే క్లారిటీ కనిపిస్తోంది. ఇప్పటికే ఏపి బయ్యర్లకు దీని మీద ఆసక్తి తగ్గిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా ఫైనల్ రన్ కు రావడం ఆన్ లైన్ పైరసీ రూపంలో ఆంధ్ర ప్రేక్షకులు ఎలాగోలా దీన్ని చూసేయడంతో ఇప్పటికిప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఏపీలో రిలీజ్ చేసినా జనం థియేటర్లకు పోటెత్తరు అనేది వాళ్ళ అభిప్రాయం.

మరి వర్మ మనసులో ఏముందో ఆయనకే తెలియాలి. కోర్ట్ స్పష్టంగా విడుదల చేసుకోవచ్చు అని చెప్పకుండా ఇలా ప్రకటన ఇవ్వడం ఒక కోణంలో తప్పే. అయినా చెప్పిన డేట్ కి వర్మ ఖచ్చితంగా తన సినిమాలు విడుదల చేసే తీరతాడు అనే థియరీ చాలా సార్లు రాంగ్ అయ్యింది కాబట్టి దీని గురించి ఇంత కన్నా ఆలోచించాల్సిన అవసరం లేదేమో