Begin typing your search above and press return to search.

లెజెండరీ నటుడికి క్యాన్సరా?

By:  Tupaki Desk   |   2 Jan 2019 12:12 PM GMT
లెజెండరీ నటుడికి క్యాన్సరా?
X
క్యాన్సర్ మహమ్మారి చిన్న పెద్ద అని చూడదు. ఎంతో ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్న వారిని కూడా అది కబళిస్తూ ఉంటుంది. ఇందుకు ఫిలిం సెలబ్రెటీలు కూడా మినహాయింపు కాదు. లిసారే.. సోనాలి బింద్రే.. ఇలా చాలామంది క్యాన్సర్ బారిన పడటం చూశాం. ఇప్పుడు ఒక లెజెండరీ నటుడికి క్యాన్సర్ అనే ప్రచారం జరుగుతోంది. ఆయన మరెవరో కాదు.. రిషి కపూర్. ఆయన క్యాన్సర్‌ తో బాధ పడుతున్నారని.. చికిత్స కోసం అమెరికాకు వెళ్లారని బాలీవుడ్ మీడియా అంటోంది. ఈ విషయంలో రిషి భార్య నీతూ కపూర్ చేసిన ఒక వ్యాఖ్య సందేహాలు రేకెత్తించింది.

నూతన సంవత్సరం ఆరంభమైన సందర్భంగా నీతూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. ‘‘హ్యాప్పీ న్యూఇయర్ 2019. ఈ ఏడాది ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. కాలుష్యం, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక క్యాన్సర్ (కర్కాటకం) అనేది జోడియాక్ సైన్‌గానే మిగిలిపోవాలి. పేదవారిని చిన్నచూపు చూడకుండా, సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ సంతోషంగా ఉండాలి’’ అంటూ నీతూ ఆ పోస్టులో పేర్కొన్నారు.

రిషి కపూర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం ఇప్పటికే మీడియాలో లీక్ అయింది. ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు కూడా రిపోర్ట్ చేశారు. నీతూ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయన క్యాన్సర్‌ తో బాధ పడుతున్న మాట నిజమే అని.. ఆ విషయాన్నే ఆమె నర్మగర్భంగా చెప్పిందని సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన కొడుకు రణబీర్ ‘సంజు’ సినిమాతో పెద్ద హిట్టు కొట్టడం.. ఆలియా భట్‌ తో పెళ్లికి రెడీ అవుతుండటంతో కొంత కాలంగా చాలా సంతోషంగా ఉన్న రిషి.. ఉన్నట్లుండి ఇలా అనారోగ్యం పాలవడం విచారకరమే