Begin typing your search above and press return to search.
ఆ రీమేక్ రిస్క్ ఏమో తేజు
By: Tupaki Desk | 19 Feb 2019 4:34 AM GMTమెగా కాంపౌండ్ నుంచి వచ్చి కెరీర్ ప్రారంభంలో చెప్పుకోదగ్గ హిట్లు తన ఖాతాలో వేసుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు బాగా కసి మీదున్నాడు. ఎలాగైనా చిత్రలహరితో గట్టి సమాధానం చెప్పాలన్న టార్గెట్ పెట్టుకున్నాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా అయిపోయింది. ఏప్రిల్ లో విడుదలకు తగ్గట్టు మరోవైపు పూర్తైన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఓ మీడియా వర్గంలో బాలీవుడ్ లేటెస్ట్ హిట్ మూవీ గల్లీ బాయ్ రీమేక్ తేజు తో చేసే ఆలోచన ఉందన్న వార్త గట్టిగానే షికారు చేసింది. సోషల్ మీడియాలో సైతం అభిమానులు విస్తృతంగా ప్రచారం చేసారు. అల్లు అరవింద్ నిర్మాతని దర్శకుడు పరశురాంని తెలుగు వెర్షన్ కు తగట్టు మార్పులు చేయమని పురమాయించారని రకరకాలుగా చెప్పుకున్నారు. ఇది నిజమో కాదో కాని ఒక్క విషయం మాత్రం లోతుగా ఆలోచించాలి
గల్లి బాయ్ మన నేటివిటీకి పూర్తిగా సూటయ్యే కథ కాదు. పైగా ర్యాప్ మ్యూజిక్ మీద మన యువతకున్న అవగాహనే తక్కువ. అలాంటిది ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే కొంత రిస్కే. పైగా హీరొయిన్ అలియా భట్ పాత్ర చిత్రీకరణ కూడా చాలా టిపికల్ గా ఉంటుంది. అందులోనూ ఇద్దరివి ముస్లిం కుటుంబాల నేపధ్యం చూపించడం వల్ల సహజత్వం బాగా సింక్ అయ్యింది.
ఒకవేళ నిజంగా తెలుగులో తీయాలి అనుకుంటే ఇవన్ని మార్చుకోవాలి. పైగా గల్లి బాయ్ క్లైమాక్స్ కాస్త చప్పగా ఉంటుంది. మనవాళ్ళకు అంతగా కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. సో గల్లి బాయ్ రీమేక్ వార్త నిజమే అయితే కనక కెరీర్ లో కాస్త బ్యాడ్ ఫేజ్ లో ఉన్న తేజుకు రిస్కే అవుతుంది. ఆ ఆలోచన లేదూ అంటే సంతోషమే