Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యామిలీలో క‌ల‌హాలున్నాయా?

By:  Tupaki Desk   |   31 Dec 2018 1:30 AM GMT
ఎన్టీఆర్ ఫ్యామిలీలో క‌ల‌హాలున్నాయా?
X
ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కాంట్రవ‌ర్శీలున్నాయా? ఉంటే ఎంత శాతం? అస‌లు నాదెండ్ల ఎపిసోడ్స్ ఉన్నాయా లేవా? మామ(ఎన్టీఆర్)- అల్లుడు(చంద్ర‌బాబు) వెన్నుపోటు ఎపిసోడ్ ఉందా లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు తెలిసీ స‌మాధానం చెప్ప‌క‌పోయావో విక్ర‌మార్కా నీ త‌ల వెయ్యి చెక్క‌ల‌గును. నేడు స్టార్ రైట‌ర్, ఎన్టీఆర్ బ‌యోపిక్ ర‌చ‌య‌త‌ బుర్రా సాయిమాధ‌వ్ ని ఈ తీరుగానే మీడియా ఉక్కిరి బిక్కిరి చేసింది.

ఎన్టీఆర్‌ కి వీరాభిమాని అయిన సాయిమాధ‌వ్ అంతే ఎమోష‌న‌ల్‌ గా స్పందించారు. మీడియా ప‌దే ప‌దే త‌న‌ను అదే వివాదాస్ప‌ద అంశాల‌ పై గుచ్చి గుచ్చి అడ‌గ‌డంతో ఆయ‌న ఆన్స‌ర్ అంతే ఇదిగా ఇచ్చారు. బుర్రాకు మీడియా అంతా ఎంతో మంచి స‌న్నిహితులు.. ఆ చ‌నువుతో ఎంతో ఫ్రెండ్లీగా ఆయ‌న్ని ప్ర‌శ్నించారు. ``ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి స్టార్ల గురించి ప్ర‌త్యేకించి అధ్య‌య‌నం చేసేదేం లేదు. జీవితంలో వీళ్లంతా ఒక భాగం. అన్న‌గారు ఎన్టీఆర్ జీవితం గురించి మాట్లాడ‌డం.. ఆయ‌న డైలాగులు చెప్ప‌డం.. ఆయ‌న్ని శోధించ‌డం ఇదే మా జీవితం.. అని ఎమోష‌న్ అయ్యారు. స‌ప‌రేట్ గా సినిమా కోసం శోధించేదేం లేదు. అయితే కొన్ని ఎపిసోడ్ల కోసం.. మాకు తెలియ‌నిది ఏం ఉందో తెలుసుకునేందుకు మాత్ర‌మే ప‌రిశోధించాను. ఎన్టీఆర్ ఆత్మ (సోల్‌)ను ఎలివేట్ చేయ‌డం కోసం ఎంతో త‌పించాం. ప‌రిశోధించాం.. అని తెలిపారు.

అయినా జ‌నాలు కాంట్ర‌వ‌ర్శీల్ని ఇష్ట‌ప‌డ‌తారు కానీ, కాంట్ర‌వ‌ర్శీల అవ‌స‌రం లేద‌ని త‌న‌దైన శైలిలో అన్నారు. ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్ప‌ద అంశాలు అన్నీ తెర‌పై ఉంటాయా? అని ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న జీవితం 100శాతం తెర‌ పై చూడొచ్చ‌ని అన్నారు. అసంపూర్ణంగా అస్స‌లు ఉండ‌దు.. అసంతృప్తిగా అసలే ఉండ‌ద‌ని ఆయ‌న త‌న‌దైన శైలిలో చ‌తుర‌త చూపించారు. ఆయ‌న జీవితంలో ఏం ఉన్నా దాచి పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. దిల్లీ మీద ఆధిప‌త్యం చూపించిన‌, అవినీతి, లంచ‌గొండిత‌నం లేని గొప్ప‌ నాయ‌కుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఇక ముగింపులో వెన్నుపోటు ఎపిసోడ్ గురించి ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్ర‌శ్న‌కు కాస్త ఆశ్చ‌ర్యంగా.. ఉద్వేగ‌పూరితంగానే స్పందించారు. `రామారావు గారికి వాళ్ల‌కు మ‌ధ్య కల‌హాలున్నాయా? .. కుటుంబ క‌ల‌హాలొచ్చాయా?`` అనీ ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించారు. ఎల్‌.వి.ప్ర‌సాద్, కె.వి.రెడ్డి ఎపిసోడ్స్ గురించి అడ‌గ‌రు కానీ, ల‌క్ష్మీ పార్వ‌తి ఎపిసోడ్స్ గురించే అడుగుతారు. జ‌నాల‌కు స‌హ‌జంగానే తెలుసుకోవాల‌నే కుతూహాలం ఉంటుంది. అయితే ఏది మంచో అదో తెర‌ పై చూపిస్తున్నాం.. అనీ సుదీర్ఘ‌మైన వివ‌ర‌ణ ఇచ్చారు. రాయ‌డానికో, కాంట్ర‌వ‌ర్శీ కోస‌మే సినిమా తీయ‌ర‌ని అన్నారు.

గాంధీ జీవిత‌చ‌రిత్ర‌లో ఎర్ర‌ర్స్ ఉన్నాయ‌ని అంటారు. వాట‌న్నిటినీ తెర‌ పై చూపించారా? ఆయ‌న జీవితంలో నిజానిజాలేంటో మ‌న‌కేవీ తెలీదు క‌దా? ఆయ‌న జీవితం నుంచి మ‌న‌కేం కావాలో అది మాత్ర‌మే తీసుకున్నాం. అదే కావాలి కూడా. ఆయ‌నో (ఎన్టీఆర్) విజేత‌. నాటి రాజ‌కీయాల్లో చాలా ప‌థ‌కాల్ని ప్రారంభించిన గొప్ప నాయ‌కుడు. సావిత్రి ఒక విజేత‌. అంత‌కంటే గెలిచేవాళ్లున్నారా? రామారావు, సావిత్రిని మించిన గొప్ప ఇంకేం ఉంది? ఎర్ర‌ర్స్ ప‌ట్టుకుని మాట్లాడ‌డం అల‌వాటు అయ్యింది అంతే.. అనీ అన్నారు సాయిమాధవ్.