Begin typing your search above and press return to search.
సుక్కు ఏం మాట్లాడుంటాడు ?
By: Tupaki Desk | 12 March 2019 10:13 AM GMTగత వారం సుకుమార్ తో నేను సినిమా చేయడం లేదు అని మహేష్ ట్విట్టర్ లో ప్రకటించేయడం మామూలు ప్రకంపనలు రేపలేదు. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం వల్లే ప్రిన్స్ హర్ట్ అయ్యాడని అందుకే కథ నచ్చినా నచ్చకపోయినా సుక్కు తో సినిమా వద్దని డిసైడ్ అయ్యాడని రకరకాలుగా ప్రచారం అయిపోయింది. నిజానికి ఈ ఇద్దరితో పాటు ఈ వివాదం వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యింది మైత్రినే.
ఎందుకంటే క్యాన్సిల్ అయిన మహేష్ మూవీకి కొత్తగా అనౌన్స్ చేసిన బన్నీ సినిమాకు రెండూ తనే నిర్మాత. దీంతో వెంటనే రంగంలోకి దిగి చెన్నైలో మహర్షి షూటింగ్ లో ఉన్న ప్రిన్స్ వద్దకు సుకుమార్ ను చల్లార్చి రమ్మని పంపింది. ఇది తనకూ మంచిదే అనుకున్న సుక్కు ఆలస్యం చేయకుండా చెన్నైలో ప్రత్యక్షమయ్యాడు.
కొంత సేపు ఏకాంత చర్చలు జరిగాయని ఎక్కడ పొరపాటు జరిగిందో సుకుమార్ పూర్తిగా వివరించి మహేష్ ని కూల్ చేశాడని అక్కడి టాక్. నేరుగా తాను కాని మైత్రి కాని ట్వీట్ చేయలేదని కేవలం పిఆర్ ల అవగాహనా లోపం వల్ల ఇలా జరిగిందని ఒకవేళ తప్పు తనది అనుకుంటే సారీ కూడా చెప్పేందుకు సుకుమార్ వెనుకాడలేదని వినికిడి.
ఇందులో నిజం ఎంతుందో అనేది పక్కన పెడితే సుకుమార్ మహర్షి సెట్ కు వెళ్లి వచ్చినట్టుగా ఆధారం చూపించే ఓ లీకైన ఫోటో బయటికి వచ్చేసింది. పూర్తి క్లారిటీ లేకపోయినా సుక్కు అక్కడ ఎందుకు ఉన్నాడో అందరికి ముందే తెలుసు కాబట్టి మ్యాటర్ క్లియర్. కాకపోతే వాళ్ళు లోపల ఏం చర్చించుకున్నారు అనేది మాత్రం సస్పెన్స్