Begin typing your search above and press return to search.
సుకుమార్ డబ్బు మనిషిగా మారిపోయాడా.?
By: Tupaki Desk | 17 Feb 2019 1:20 PM IST రంగస్థలం సినిమా సుకుమార్ తో చాలా మార్పు తీసుకువచ్చింది. అంతకుముందు సుకుమార్ సినిమాలు హిట్ అయ్యేవి. బాగా తీశాడని పేరు వచ్చేవి. కానీ ఆర్థికంగా సుకుమార్ తీసిన సినిమాలు ఏవీ బంపర్ హిట్లు కాదు. ఎందుకంటే బడ్జెట్ కు అటుగా ఇటుగా కలెక్షన్లు వచ్చాయి. కానీ తొలిసారి రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దీంతో… అప్పటినుంచి సుకుమార్ కూడా కూడా నిర్మాతగా తానేంటో నిరూపించాకోవాలని ఆశపుట్టింది. అందుకే.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బోలెడన్నీ సినిమాల్ని ప్లాన్ చేస్తున్నాడు. గతంలో 21కుమారి ఎఫ్, దర్శకుడు సినిమాలు తీశారు. ఇప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ప్లాన్ చేస్తున్నారు.
నిర్మాతగా మారాడు సరే.. కానీ అదే టైమ్ లో తన ప్రాజెక్టుల్ని పక్కన పెట్టేసినట్లు కన్పిస్తోంది. తన సొంత ప్రాజెక్టుల వల్ల ఇప్పటికే మహేశ్ సినిమా బాగా లేట్ అయ్యింది. సమ్మర్ లో కూడా ఈ సినిమా స్టార్ట్ అవుతుందో లేదో డౌటే. దీంతో.. సినిమా నిర్మాణంలో బిజీ అయిపోయి మహేశ్ సినిమాను నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శల్ని ఎదుర్కుంటున్నాడు. అయితే..ఈ విమర్శల్లో ఏమాత్రం నిజం లేదు. ఓవైపు మహేశ్ సినిమాకు కథని ఫైనల్ చేస్తూనే .. మరోవైపు తన శిష్యుల్ని దర్శకులుగా మార్చేందుకు తాపత్రయ పడుతున్నాడు.
ఇండస్ట్రీలో తమ దగ్గర పనిచేసే అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్లని మెయిన్ డైరెక్టర్లు పెద్దగా పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే సినిమా అవకాశాలు కూడా రానివ్వకుండా అడ్డుపడతారు. కానీ సుక్కు అలాక్కాదు. తన దగ్గర పనిచేస్తున్న వారిని తన డబ్బులతో దర్శకులుగా మారుస్తున్నాడు. నిజంగా సుకుమార్ కు డబ్బు అవసరం అనుకుంటే.. ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయగలడు. కానీ సుక్కుకి డబ్బు ప్రధానం కాదు. అందుకే మంచి మంచి సినిమాలే తీస్తున్నాడు, అలాంటి సినిమాలకే నిర్మాతగా మారి శిష్యుల్ని ప్రోత్సహిస్తున్నాడు.