Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : ఇదేంటి మెగాస్టార్ వయసు పెరగడం ఆగిపోయిందా?

By:  Tupaki Desk   |   10 Jan 2022 11:30 AM GMT
ఫొటోటాక్ : ఇదేంటి మెగాస్టార్ వయసు పెరగడం ఆగిపోయిందా?
X
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా ఇటీవల 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 50 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా కంటిన్యూ గా సినిమాలను చేస్తూనే ఉన్నాడు. వరుసగా సినిమాలను చేస్తున్న మమ్ముట్టి వయసు ఏడు పదులు అయినా కూడా ఇంకా చూడడానికి నాలుగు పదుల వయసు వ్యక్తిగానే కనిపిస్తాడు. ఆయన కొడుకు దుల్కర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి దూసుకు పోతున్నా కూడా ఇప్పటికి మమ్ముట్టి కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన తన కాలేజీ స్నేహితులతో కలిసి రీయూనియన్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో తీసుకున్న ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

మమ్ముట్టి కాలేజ్ స్నేహితులు అంటే అంతా కూడా ఆయన వయసు వాళ్లే ఉంటారు. అందరు కూడా ఏడు పదుల వయసు అంతకు మించిన వయసు వాళ్లే కనుక అందరు కూడా ముసలి వాళ్లు అయ్యి తాతలు అయినట్లుగా కనిపిస్తున్నారు. కాని వారి పక్కన ఉన్న మమ్ముట్టీ మాత్రం చాలా స్పెషల్‌ గా కనిపిస్తున్నాడు. వాళ్లకంటే పాతిక ముప్పై ఏళ్ల నిన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మమ్ముట్టీ ఇలా స్నేహితుల పక్కన నిల్చుని దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు అంతా కూడా వాళ్లకు మమ్ముట్టికి ఎంత తేడా ఉంది అన్నట్లుగానే చర్చించుకుంటున్నారు. హీరో కనుక కాస్త వయసు తక్కువ గా కనిపించవచ్చు. కాని మమ్ముట్టి మాత్రం కాస్త కాదు చాలా తక్కువ వయసుగా కనిపిస్తున్నాడు.

మమ్ముట్టి వరుసగా మలయాళంలో సినిమాలు చేస్తున్నాడు. తెలుగు లో ఈయన యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించి మెప్పించారు. నిజంగా రాజశేఖర్ రెడ్డి వచ్చాడా అన్నట్లుగా కట్టు బట్ట.. బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా వావ్‌ అనిపించేలా యాత్ర సినిమాలో మమ్ముట్టి ఇమిటేట్‌ చేయడం జరిగింది. అందుకే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు లో రెగ్యులర్‌ గా మమ్ముట్టీకి ఆఫర్లు వస్తూనే ఉన్నా కూడా ఆయన మాత్రం ఆచితూచి ఆఫర్లను సెలక్ట్‌ చేసుకుంటున్నాడు. అందుకే ఆయన ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేశాడు తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల మరియు అభిమానుల టాక్‌.