Begin typing your search above and press return to search.
ఆ యువ హీరో డౌన్ ఫాల్ మొదలైందా?
By: Tupaki Desk | 27 Aug 2022 12:30 PM GMTఆ యువ హీరో టాలీవుడ్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టి అటుపై హీరోగా ప్రమోట్ అయ్యాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నేడు పాన్ ఇండియాలోనే ఫేమస్ అయ్యేంతగా పేరు తెచ్చుకున్నాడు. ఈ స్థాయికి రావడానికి ఎంతగానో శ్రమించాడు.
ఆ శ్రమని గుర్తించి కొంత మంది బడా నిర్మాతలు అతన్ని వెనుకుండి ప్రోత్సహించారు. సాధారణంగా ఇలాంటి ప్రోత్సాహం అంత సులభంగా దొరకదు. కానీ ఆ విషయంలో యంగ్ హీరో ఎంతో లక్కీ గయ్. ఆ లక్ తో నే చేసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీతో పాన్ ఇండియాలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ హ్యాంగోవర్లోనే ఓ బడా దర్శకుడు కళ్లలో పడ్డాడు.
కుర్రాడిలో మ్యాటర్ ఉందని గుర్తించి తన సినిమాలో అవకాశం కల్పించాడు. దాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇటీవల రిలీజ్ అయిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలింది. సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత సన్నివేశం మొత్తం మారిపోయింది. ఆశలన్నీ అడియాశలే అయ్యాయి.
హీరో శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక ఆ సినిమా రిలీజ్ కి ముందు హీరో అతి గురించైతే చెప్పాల్సిన పనిలేదు. సినిమా ని బోయ్ కట్ చేస్తారా? చూసుకుందా? అంటూ సవాల్ విసిరాడు. ఆ రకంగా ఓ రేంజ్ లో యాటిట్యూడ్ చూపించాడని విమర్శలు ఎదుర్కున్నాడు.
కానీ తాజా వైఫ్యలంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. హీరోపై రకరకాల మీమ్స్..ట్రోల్సింగ్ తో సీన్ ఎంత గా దిగజారుతుందో అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ జ్యోతిష్యుడు సైతం ఆ యంగ్ హీరో జాతకం ఏమాత్రం బాగోలేదని ..ఇకపై అన్ని వైఫల్యే ఎదురవుతాయని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు.
ఇంత వరకూ అతని ప్రయాణం సాపీగా సాగింది. ఇకపై అన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయని..వాటికి పరిహారం కూడా లేదని భవిష్యత్ చెప్పే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం ఆ హీరో అదే దర్శకుడితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజా ఎఫెక్ట్ ఆ సినిమాపై సైతం పడుతుందని బాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి.
ఈ వైఫల్యంతో అక్కడ పూర్తిగా మార్కెట్ డౌన్ అయిపోతుందని...బోయ్ కట్ అనే నినాదం అంత ఈజీగా అతన్ని వదిలిపెట్టదని అందుకు అమీర్ ఖాన్ లాంటి నటుల్ని గుర్తు చేస్తున్నారు. సదరు దర్శకుడి బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ సినిమాతో తీవ్రంగా దెబ్బతింది అంటున్నారు. ఆరకంగా హీరో తెలుగు మార్కెట్ పై కూడా ప్రతికూల వాతావరణం తప్పదని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.